తెలంగాణ

telangana

కేటీఆర్​ యూఎస్​ టూర్​.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నంటే?

By

Published : Mar 29, 2022, 6:54 AM IST

అమెరికాలో మంత్రి కేటీఆర్​ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.7500 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తన పర్యటనను ఫలవంతంగా మార్చిన బృందానికి కేటీఆర్​ అభినందనలు తెలిపారు.

ktr
ktr

అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బృందం రూ.7500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో పర్యటించిన వారం రోజుల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, ఇన్నోవేషన్ వంటి నాలుగు సెక్టార్లలో పలు కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈవెంట్లు, 35 వరకు బిజినెస్ సమ్మిట్లలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

అమెరికా పర్యటనను ప్రభావవంతంగా, ఫలవంతంగా మార్చిన తన బృందాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. యూఎస్​ పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయుల ఆతిధ్యానికి మంత్రి కేటీఆర్​ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details