తెలంగాణ

telangana

ఆర్జీయూకేటీలో 1,078 మందికి దృష్టి లోపాలు

By

Published : Jul 20, 2022, 7:44 AM IST

RGUKT Basar
RGUKT Basar ()

RGUKT Basar News: బాసర ఆర్‌జీయూకేటీని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా విద్యార్థుల్లో పలువురు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. జూన్‌ 22 నుంచి ఈ నెల 5 వరకు విశ్వవిద్యాలయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తం 4,876 మందిని పరీక్షించగా.. 1,078 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు బయటపడింది.

RGUKT Basar News: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్‌జీయూకేటీ విద్యార్థుల్లో పలువురు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. జూన్‌ 22 నుంచి ఈ నెల 5 వరకు విశ్వవిద్యాలయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తం 4,876 మందిని పరీక్షించగా.. 1,078 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు బయటపడింది. అంటే 22 శాతం మంది కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. 3,048 మంది బాలికలకు గాను 667 మందిలో దృష్టిలోపం కనిపించింది. మిగిలిన 1,828 మంది అబ్బాయిల్లో 411 మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు వైద్యులు తేల్చారు. కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కువగా వాడుతుండడం వల్ల ఎక్కువ మందికి కంటి సమస్యలు వస్తున్నాయని వర్సిటీ ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలో 4,500 మంది విద్యార్థినులు ఉండగా.. దాదాపు వెయ్యిమందిలో రక్తహీనత సమస్య ఉన్నట్లు డాక్టర్‌ ఒకరు చెప్పారు. పోషకాహార లోపం ఒక కారణమని తెలిపారు.

ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రితో ఒప్పందం..కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రితో విశ్వవిద్యాలయం ఎంఓయూ కుదుర్చుకోనుందని ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ చెప్పారు. తరచూ వైద్యులు వచ్చి విద్యార్థులను పరీక్షించడం, అవసరమైతే రాయితీతో విద్యార్థులకు వైద్య సేవలు అందించడం లాంటి సేవల కోసం ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details