తెలంగాణ

telangana

కంటెంట్​ క్రియేటర్స్​కు పండగే.. త్వరలో ట్విట్టర్​లో డబ్బులే డబ్బులు!

By

Published : Jun 10, 2023, 4:13 PM IST

Twitter Verification Content Creator : సీఈఓగా లిండా బాధ్యతలు స్వీకరించిన తరువాత ట్విట్టర్​ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వెరిఫైడ్​ కంటెంట్​ క్రియేటర్స్​కి మోనటేజేషన్​ను ఎనేబుల్​ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ.41 కోట్లు వరకు కేటాయించినట్లు స్పష్టం చేసింది.

Twitter to pay Verified content creators for Ads
వెరిఫైడ్​ కంటెంట్​ క్రియేటర్స్​కి డబ్బులు ఇస్తాం : ఎలాన్​ మస్క్​

Twitter Verification Content Creator : ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్.. త్వరలోనే తన వేదికలో మోనటైజేషన్​ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.​ కొత్త సీఈఓ లిండా యాకరినో ట్విట్టర్​ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వెరిఫైడ్​ కంటెంట్ క్రియేటర్స్​కి మాత్రమే ఈ మోనటైజేషన్​ ఇవ్వనున్నట్లు ట్విట్టర్​ తెలిపింది. ఇందుకోసం సుమారుగా 5 మిలియన్​ డాలర్లు అంటే సుమారుగా రూ.41కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా పేర్కొంది. వెరిఫైడ్ కంటెంట్​ క్రియేటర్స్​​ ఖాతాలకు మాత్రమే యాడ్​లను సర్వ్​ చేస్తామని ట్విట్టర్ మాజీ సీఈఓ ఎలాన్​ మస్క్ తెలిపారు.

మస్క్​తో ట్విట్టర్​ పరేషాన్!
టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​ను కొనుగోలు చేసిన తరువాత ఆ సంస్థ తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా మస్క్​ కీలక పదవుల్లో ఉన్న ట్విట్టర్​ ఉద్యోగులను తొలగించడం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. ముఖ్యంగా చాలా ఎడ్వర్టైజ్​మెంట్​ కంపెనీలు ట్విట్టర్​కు దూరం అయ్యాయి. దీనిని పరిష్కరించడానికే ఎలాన్​ మస్క్​ .. ఎడ్వర్టైజింగ్​ వెటెరన్​ లిండాను ట్విట్టర్​ సీఈఓగా నియమించారు.

లిండా సారథ్యంలో ట్విట్టర్​ దూసుకుపోతుందా?
ట్విట్టర్​ కొత్త సీఈఓ లిండా ఎడ్వర్టైజ్​ రంగంలో గొప్ప అనుభవజ్ఞురాలు. గతంలో ఆమె ఎన్​బీసీ యూనివర్సల్​లో పనిచేశారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలలో ఆమె చాలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా యాడ్​ సేల్స్​ను డిజిటల్​ రూపంలోకి మార్చడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఇదే అంశం ఇప్పుడు ట్విట్టర్​కు ఆర్థికంగా కలిసి వస్తుందని నిపుణలు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వరల్డ్​ పాపులర్​ మెసేజింగ్​ యాప్​ గంటకు 5 నుంచి 6 సెంట్లు సంపాదిస్తోంది. యూజర్ల నుంచి మరింత ఆదరణ కనుక పొందితే గంటకు కచ్చితంగా 15 సెంట్లు వరకు సంపాదించవచ్చని, ఈ మార్చి నెలలో ఎలాన్ మస్క్​ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.

సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్స్​పై.. రెగ్యులేటరీ యాక్షన్స్​
ట్విట్టర్​తో సహా ప్రస్తుతం మెటా ప్లాట్​ఫామ్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​, ఆల్ఫాబెట్​కి చెందిన యూట్యూబ్​, టిక్​టాక్​లపై యూరోపియన్ కమిషన్​ అండ్​ కన్సూమర్​ అథారిటీలు అనేక రెగ్యులేటరీ యాక్షన్స్​ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సామాజిక వేదికలు తమ దగ్గర ఉన్న యూజర్ల సమాచారాన్ని మిస్​లీడింగ్​ ప్రమోషన్​ల కోసం, క్రిప్టో ఆసెట్​ల కోసం దుర్వినియోగం చేస్తుండడమే ఇందుకు కారణం. దీని వల్ల వినియోగదారులు గణనీయమైన స్థాయిలో ఆర్థికంగా నష్టపోతున్నట్లు యూరోపియన్ వినియోగదారుల సంఘం BEAU తన ఫిర్యాదులో పేర్కొంది.

ట్విట్టర్ సీఈఓగా లిండా బాధ్యతలు..
Twitter New CEO : ట్విట్టర్​ కొత్త సీఈఓగా లిండా యాకరినో.. ఇటీవల బాధ్యతలను స్వీకరించారు. ఇక నుంచి ట్విట్టర్ వ్యాపార కార్యకలాపాలను.. పూర్తిగా లిండా యాకరినో చూసుకోనున్నారు. ట్విట్టర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమెతో పాటు పనిచేసిన ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ వైస్​ ప్రెజిడెంట్​.. జో బెనారోచ్ కూడా తన టీంలో చేర్చుకున్నారు లిండా. జో బెనారోచ్.. లిండాకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్​ ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త సాంకేతికపై దృష్టి సారించనున్నారు. దాంతో పాటు టెస్లా, స్పేస్​ ఎక్స్​పై ఆయన పూర్తి స్థాయిలో పని చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details