తెలంగాణ

telangana

IT Sector Salary Hike Issue : ఐటీ ఉద్యోగులకు శాలరీ హైక్​ ఇవ్వడంలేదు?.. కారణం అదేనా?

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 3:38 PM IST

IT Sector Salary Hike Issue In Telugu : ఈ ఏడాది మెజారిటీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను ఇప్పటి వరకు పెంచలేదు. కొన్ని కంపెనీలు మాత్రం నామమాత్రంగా శాలరీలు పెంచుతామని చెబుతున్నాయి. కానీ వాటిని కూడా వాయిదా వేస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణం ఏమిటి?

salary hikes in it sector
IT Sector Salary Hike Issue

IT Sector Salary Hike Issue : దేశంలోని ఐటీ ఉద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పడం లేదు. ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, విప్రో.. ఇలా కంపెనీ ఏదేనా కూడా తమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు లేదా శాలరీ హైక్​లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. పైగా దీర్ఘకాలంపాటు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఇది భారతీయ ఐటీ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.

జీతాలు పెంచడం లేదు!
Infosys Salary Hike 2023 : ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​ ఇప్పటి వరకు తమ ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. సాధారణంగా ఇన్ఫోసిస్ జూన్​ లేదా జులై మాసంలో తమ ఉద్యోగుల శాలరీలు పెంచుతూ ఉంటుంది. పెంచిన జీతాలు ఏప్రిల్ మాసం నుంచి అమలు చేస్తుంటుంది. కానీ ఈ ఏడాది ఇలాంటిది ఏమీ జరగలేదు.

HCLTECH Salary Hike 2023 : హెచ్​సీఎల్​ టెక్​ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ సీనియర్ ఉద్యోగుల జీతాల పెంపును పూర్తిగా వాయిదా వేసింది. అలాగే జూనియర్ ఉద్యోగుల జీతాలను కూడా ఓ త్రైమాసికంగా వాయిదా వేస్తూ వస్తోంది.

శాలరీ పెంచే ఆలోచన చేస్తున్నారు!
WIPRO Salary Hike 2023 : విప్రో మాత్రం ఈ ఏడాది కచ్చితంగా తమ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బహుశా అక్టోబర్​- డిసెంబర్​ త్రైమాసికంగా శాలరీ హైక్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే విప్రో గతేడాది సెప్టెంబర్​లోనే శాలరీ హైక్​ ఇవ్వడం గమనించాల్సిన విషయం.

జీతాలు పెంచారు.. కానీ..
Tech Mahindra Salary Hike 2023 :టెక్​ మహీంద్రా తమ కంపెనీలోని జూనియర్​, మిడ్​ లెవల్​ ఉద్యోగుల జీతాలు పెంచింది. కానీ ఓ త్రైమాసికంగా సీనియర్ ఉద్యోగుల జీతాలను వాయిదా వేస్తూ వస్తోంది.

TCS Salary Hike 2023 :టీసీఎస్​ తమ కంపెనీ ఉద్యోగులకు నామమాత్రంగా 6% - 8% వరకు మాత్రమే శాలరీ హైక్​ ప్రకటించింది. వాస్తవానికి గతేడాది కూడా టీసీఎస్​ ఈ మేరకే జీతాలు పెంచడం గమనార్హం. అయితే కొంత మంది బెస్ట్​ పెర్ఫార్మర్స్​కు మాత్రం మంచి (డబుల్ డిజిట్​) శాలరీ హైక్​ ఇచ్చినట్లు సమాచారం.

చిన్న కంపెనీల పరిస్థితి ఏమిటి?
Indian IT Sector Companies : కోఫోర్జ్​, పెర్సిస్టెంట్​ సిస్టమ్స్​, ఎల్​టీఐ మైండ్​ట్రీ.. మొదలైన మధ్య స్థాయి ఐటీ కంపెనీలు మాత్రం.. తమ ఉద్యోగులకు మంచి శాలరీ హైక్​ను ప్రకటించాయి.

ఐటీ సెక్టార్​ మందగమనానికి కారణాలు ఏమిటి?
IT Sector Increment News 2023 :భారత ఐటీ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి తోడు బ్యాంకింగ్​, ఫైనాన్సియల్​ సర్వీసెస్​ ఇండస్ట్రీలపై ఆధారపడిన.. టెక్​ కంపెనీల పరిస్థితి ప్రస్తుతం మరింత ఇబ్బందికరంగా ఉంది. ఉదాహరణకు బ్యాంకింగ్​, ఫైనాన్సియల్​ సర్వీసెస్​, ఇన్సూరెన్స్​ (BFSI) సెక్టార్​లో మందగమనం నడుస్తోంది. ఈ ప్రభావం నేరుగా ఇన్ఫోసిస్​ కంపెనీపై పడుతోంది. అందువల్ల 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్​ వద్ధి అంచనాల్లో తగ్గుదల కనిపిస్తోంది. వాస్తవానికి కంపెనీ వృద్ధి అంచనాలు మొదటి త్రైమాసికంలో 4%-7% ఉంటే.. ఇప్పుడు అది 1% - 3.5% మధ్యలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించి ఇదే అత్యల్ప వృద్ధి రేటు.

వ్యయాలు తగ్గించుకునేందుకే!
Indian IT Sector Outlook :విప్రో కంపెనీ ఆదాయం కూడా జూన్​ త్రైమాసికంలో 2.8 శాతం మేర తగ్గింది. వాస్తవానికి విప్రో జూన్ త్రైమాసికంలో 9000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఇది ఆ కంపెనీ ఆర్థిక సంక్లిష్ట పరిస్థితిని తెలియజేస్తుంది. అయితే ఈ విషయంపై విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే ఓ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం బలహీనమైన స్థూల ఆర్థిక పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కంపెనీలు తమ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు, జీతాల పెంపు వాయిదా లాంటి చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details