ETV Bharat / state

GIG Jobs In E-Commerce Sector : నిరుద్యోగులకు 'గిగ్' గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 4 లక్షల కొత్త ఉద్యోగాలు..

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 11:40 AM IST

GIG Jobs In E-Commerce Sector : మీరు నిరుద్యోగులా..? ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే. రానున్న ఈ పండుగల సీజన్‌లో 4 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయట. ఈ-కామర్స్‌ రంగంలో ఈ ఉద్యోగావకాశాలు ఉండొచ్చని ఓ ప్రముఖ సంస్థ వెల్లడించింది.

4 Lakh New GIG Jobs in E Commerce Sector in Southern Cities
New GIG Jobs in E-Commerce Sector

GIG Jobs In E-Commerce Sector : టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అనే మానవ వనరుల సంస్థ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాబోతున్న పండుగల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని నగరాల్లో ఈ-కామర్స్‌ రంగంలో 4 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. మార్కెట్ సెంటిమెంట్‌, పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన సమాచారం తదితర అంశాల ఆధారంగా ఈ అంచనా వేసినట్లు స్పష్టం చేసింది.

4 Lakh GIG Jobs in E-Commerce in South India : ఇందులో అత్యధికంగా బెంగళూరులో 40 శాతం, తదుపరి స్థానాల్లో హైదరాబాద్‌(30 శాతం), చెన్నై(30 శాతం)ల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఇదే సమయంలో కేవలం ప్రథమ శ్రేణి నగరాలకే ఈ-కామర్స్‌ గిరాకీ పరిమితం కాదని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఈ-కామర్స్ సేవలను విస్తరిస్తున్నట్లు అంచనా వేసింది. దీనివల్ల ద్వితీయశ్రేణి నగరాల్లోనూ కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.

AIATSL Job News Today : పదో తరగతి అర్హతతో.. 998 హ్యాండీమ్యాన్​, ఏజెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

GIG Jobs In E-Commerce Hyderabad : త్వరలో రానున్న వినాయక చవితితో ప్రస్తుత పండుగల సీజన్‌ ప్రారంభమై.. నవంబర్ నెలలో వచ్చే దీపావళితో ముగుస్తుంది. ఈ-కామర్స్‌లో లభించే ఉద్యోగాలు ప్రధానంగా గిగ్‌ (డెలివరీ పార్ట్‌నర్లు, కాల్‌ సెంటర్లు, గోదాముల నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యే వారు) విభాగానికి చెంది ఉంటాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 7 లక్షల 'గిగ్' ఉద్యోగాలు.. : ఈ పండుగల సీజన్‌ కోసం గత 3 నెలలుగా ఈ-కామర్స్‌ సంస్థలు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నాయని, దీనికి తోడు ప్రభుత్వ విధానాలు, వినియోగదారుల సెంటిమెంట్‌, డిజిటలీకరణ ఈ రంగానికి కలిసొస్తున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు ఎ.బాల సుబ్రమణియన్‌ తెలిపారు. అందువల్లే గతేడాదితో పోల్చితే.. ఈసారి దేశ వ్యాప్తంగా 'గిగ్‌' ఉద్యోగాల్లో 25 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో దక్షిణాది నగరాల్లో దీని కంటే మిన్నగా 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని చెప్పారు. దేశ వ్యాప్తంగా దాదాపు 7 లక్షల 'గిగ్‌' ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ-కామర్స్‌తో పాటు రిటైల్‌, లాజిస్టిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

ONGC Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో.. ఓఎన్​జీసీలో అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

2029-30 నాటికి 2.35 కోట్ల కొలువులు! దేశంలో వినియోగవ్యయం 2030 నాటికి 4 ట్రిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల మన దేశంలో 'గిగ్‌ ఎకానమీ' బహుముఖంగా విస్తరిస్తుందని, 2029-30 నాటికి దేశ వ్యాప్తంగా 'గిగ్‌' ఉద్యోగాల సంఖ్య 2.35 కోట్లకు చేరతాయని పరిశ్రమ వర్గాల అంచనా.

NABARD Jobs 2023 : నాబార్డ్​లో అసిస్టెంట్​ మేనేజర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష ఉద్యోగాలు!: వచ్చే పండుగల దృష్ట్యా ఫ్లిప్‌కార్ట్‌ లక్ష మందికి తాత్కాలికంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో కొన్ని ప్రత్యక్ష, మరికొన్ని పరోక్ష ఉద్యోగాలు ఉంటాయని తెలిపింది. స్థానికంగా కిరాణ షాప్స్‌, ఉన్నవారికి, దివ్యాంగులు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది.

SBI JOBS 2023 : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 6,160 అప్రెంటీస్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.