తెలంగాణ

telangana

Aadhaar Update : ఆధార్​ ఫ్రీ అప్డేట్​కు ఇంకా కొద్ది రోజులే ఛాన్స్​.. ఆ తేదీ దాటితే మాత్రం..

By

Published : Aug 3, 2023, 1:58 PM IST

Free Aadhaar Update In Telugu : ఆధార్ ​కార్డ్​ అప్​డేషన్​కు 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెల 14లోపు ప్రతి వ్యక్తి తమ ఆధార్​ వివరాలను ఉచితంగా అప్డేట్​ చేసుకోవాలని.. గడువు తేదీ దాటాక అప్డేట్​ చేసుకుంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందేనని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.

Good News For Aadhaar Card Holders UIDAI Offering Free Aadhaar Update Service Till September 14 2023 Full Details Here In Telugu
ఆధార్​ ఫ్రీ అప్డేట్​కు 40 రోజులే ఛాన్స్​.. ఆ తేదీ దాటితే మాత్రం డబ్బులు కట్టాల్సిందే..

Free Aadhaar Update Last Date : ఆధార్​ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆధార్ తీసుకుని 10ఏళ్లు దాటిన వారు సెప్టెంబర్​ 14లోపు ​కార్డ్​లోని వ్యక్తిగత వివరాలను అప్డేట్​ చేసుకోవాలి. గడువు తేదీ దాటాక మాత్రం అప్డేట్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తే నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాస్తవానికి ఆధార్​ ఫ్రీ అప్​డేషన్​ తుది గడువు జూన్​ 14తో ముగిసింది. కాగా, చాలామంది ఇంకా చేసుకోవాల్సి ఉందన్న కారణంతో ఈ గడువును మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ'(యూఐడీఏఐ). వచ్చే నెల(సెప్టెంబర్​) 14 వరకు ఆధార్​ వివరాలను ఉచితంగా అప్డేట్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువు కూడా ముగిస్తే ఆధార్‌ అప్‌డేట్‌ చేసేందుకు ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

డెడ్​లైన్​ దాటితే అప్డేట్​ చేసుకోలేమా..?
Free Aadhaar Update Last Date Extended : 'ఆధార్'​.. దేశంలోని ప్రతి పౌరుడి దగ్గర కచ్చితంగా ధ్రువపత్రం. ఎందుకంటే ప్రస్తుతం ఏ పని జరగాలన్నా ఇదే ఆధారం. 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం.. ఆధార్​ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను ప్రతి పౌరుడు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. దీనికి సంబంధించి ఉచిత సేవలు 'మై ఆధార్‌' పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులుచేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, పదేళ్లకోసారి చేసే ఈ ప్రక్రియ పౌరుల వివరాల్లో కచ్చితత్వాన్ని కనుగొనడంలో సహాయపడుతుందని కేంద్రం తెలిపింది.

ఇంట్లో నుంచే అప్‌డేట్‌ చేసుకోండిలా..

  1. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్​ సంఖ్యతో లాగిన్​ అవ్వండి.
  2. 'ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  3. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
  4. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత 'డాక్యుమెంట్‌ అప్‌డేట్‌'పై క్లిక్‌ చేయాలి.
  5. అప్పటికే ఉన్న వివరాలు మీ ఫోన్​ లేదా కంప్యూటర్​ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అప్పుడు మీ పేరులో, పుట్టిన తేదీలో, ఇంటి చిరునామా వంటి వాటిల్లో ఏమైనా మార్పులుచేర్పులు ఉంటే చేయండి. ఒకవేళ ఏమి మార్చేందుకు లేని సమయంలో ఉన్న ఉన్న వివరాలనే ఒకసారి వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయండి.
  6. తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి 'ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌' డాక్యుమెంట్లను ఎంచుకోండి.
  7. సంబంధిత డాక్యుమెంట్ల స్కాన్​ చేసిన కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్​పై క్లిక్‌ చేయండి.
  8. చివరగా 14 అంకెల 'అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌' వస్తుంది. దీని ద్వారా అప్‌డేటెడ్​ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు https://myaadhaar.uidai.gov.in/ వెబ్​సైట్​లో చెక్‌ చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details