ETV Bharat / business

డెబిట్ కార్డ్ లేకపోయినా UPI యాక్టివేషన్​.. ప్రాసెస్ ఇలా..

author img

By

Published : Jun 7, 2023, 5:19 PM IST

G Pay Aadhaar based UPI registration : డిజిటల్​ చెల్లింపులను పెంచడానికి ఆధార్​ ఆధారిత యూపీఐ రిజిస్ట్రేషన్​లను ప్రారంభించినట్లు గూగుల్​ పే తెలిపింది. డెబిట్​ కార్డ్​ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా అత్యంత సురక్షితమైన నగదు చెల్లింపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

G Pay  UPI registration
Google Pay Aadhaar based UPI registration

UPI without debit card : ఆధార్​ ఆధారిత యూపీఐ రిజిస్ట్రేషన్​లను ప్రారంభిస్తున్నట్లు గూగుల్​ పే ప్రకటించింది. దీని ద్వారా ప్రజలు సులువుగా డిజిటల్​ చెల్లింపులు చేసుకోవడానికి వీలువుతుందని పేర్కొంది. నేషనల్​ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (NPCI)లో ప్రజలు తమ ఆధార్​ నెంబర్​తో యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

UPI registration without Debit card in Google Pay :
గూగుల్​పే తెచ్చిన ఈ కొత్త ఫీచర్​తో డెబిట్​ కార్డ్​ లేకున్నా.. యూజర్లు తమ యూపీఐ పిన్​ ద్వారా నగదు చెల్లింపులు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం యూజర్లు తమ ఆధార్​ను బ్యాంక్​ ఖాతాకు లింక్​ చేయాల్సి ఉంటుంది. అలాగే తమ బ్యాంక్​ అకౌంట్​కు అనుసంధానంగా ఉన్న రిజిస్టర్డ్ ఫోన్​ నెంబర్​ను.. Google pay లోనూ వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ Google payతో అనుసంధానం కలిగిన బ్యాంకు అకౌంట్​ ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మిగతా బ్యాంకు అకౌంట్​ హోల్డర్స్​కు ఈ ఫీచర్​ను విస్తరించనున్నారు.

Gpay Aadhaar UPI registration process :
యూపీఐ పిన్​ ఎలా క్రియేట్​ చేయాలి?

  1. ప్లేస్టోర్​ నుంచి గూగుల్​ పే యాప్​ను డౌన్​ లోడ్​ చేసుకోవాలి.
  2. యూజర్లు డెబిట్​ కార్డ్ వాడాలా? లేదా ఆధార్​ వాడాలా? అనేది నిర్ణయించుకోవాలి.
  3. ఆధార్​ను ఎంచుకుంటే.. ఆధార్​ కార్డ్​లోని మొదటి ఆరు డిజిట్స్​ను ఎంటర్​ చేయాలి.
  4. తరువాత ఓటీపీని ఎంటర్​ చేసి, ప్రామాణీకరించుకోవాలి.
  5. అప్పుడు యూజర్​కు సంబంధించిన బ్యాంకు వెరిఫికేషన్​ ప్రాసెస్​ను పూర్తి చేసి, యూపీఐ పిన్​ను ఎనేబుల్​ చేస్తుంది. దీనితో యాక్టివేషన్ పూర్తి​ అవుతుంది.
  6. యూజర్లు తమ ఆన్​లైన్​ పేమెంట్స్​ను సులువుగా చేసుకోవడానికి, బ్యాలెన్స్​ చూసుకోవడానికి వీలవుతుంది.

ఈ విధంగా యూజర్లు సురక్షితమైన నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గూగుల్​ పే మన ఆధార్​ నంబర్​ను​ స్టోర్​ చేయదు. కేవలం ఎన్​పీసీఐ వద్దనే మన నంబర్​ ఉంటుంది.

99.9శాతం మందికి ఆధార్​
భారతదేశంలో వయోజనుల్లో 99.9 శాతం మందికి ఆధార్​ నంబర్​ ఉంది. వీరు కనీసం నెలకు ఒక్కసారైనా తమ ఆధార్​ నంబర్​ను వినియోగిస్తున్నారు.

రెడ్​సీర్​ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ (RSC)​ నివేదిక ప్రకారం, భారతదేశంలో 40 కోట్ల మంది ప్రజలు డిజిటల్​ లావాదేవీలు​ చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది ఇంటికి అవసరమైన సామానులు కొనడానికి, ఫుడ్ డెలివరీ కోసం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ట్రావెల్​ ఇండస్ట్రీస్​ నుంచి కూడా డిజిటల్​ లావాదేవీలు అధిక మొత్తంలోనే జరుగుతున్నాయి. ఫోన్​పే, గూగుల్​ పే, పేటీఎం లాంటి నగదు చెల్లింపు యాప్స్​లో 95 శాతం పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి.

" భారతదేశంలో 2026 నాటికి డిజిటల్​ పేమెంట్​ మార్కెట్​ విలువ రూ.4,000 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం డిజిటల్​ పేమెంట్ మార్కెట్​ విలువ రూ.3,200 లక్షల కోట్లుగా ఉంది."
- రెడ్​సీర్​ స్ట్రాటజీ కన్సల్టెంట్స్​ నివేదిక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.