తెలంగాణ

telangana

తగ్గిన బంగారం ధర.. స్టాక్ మార్కెట్లపై బేర్ దెబ్బ.. సరికొత్త కనిష్ఠానికి రూపాయి

By

Published : Sep 26, 2022, 10:53 AM IST

Updated : Sep 26, 2022, 3:33 PM IST

Gold Rate Today
Gold Rate Today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. రూపాయి విలువ భారీగా పతనమైంది. మరోసారి కనిష్ఠస్థాయిని చేరింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.50 తగ్గి.. ప్రస్తుతం రూ.51,110గా ఉంది. వెండి ధర భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.800 మేర తగ్గి.. రూ.56,600 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,110గా ఉంది. కిలో వెండి ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,600గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,110గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,110వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1636 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.55 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. వచ్చే శుక్రవారం ఆర్​బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగుతున్నారు. వడ్డీ రేట్ల పెంపు తథ్యం అన్న అంచనాల మధ్య.. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 57,145 వద్ద ట్రేడవుతోంది. నెస్లే ఇండియా, హెచ్​సీఎల్ టెక్ మినహా సెన్సెక్స్ 30లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది. 312 పాయింట్లు పతనమైన సూచీ.. 17,014 వద్ద కదలాడుతోంది. అన్ని రంగాల షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఆటో, విద్యుత్, రియాల్టీ, లోహ రంగ షేర్లు 3 నుంచి 4 శాతం మేర పతనమయ్యాయి.

సరికొత్త కనిష్ఠానికి రూపాయి
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త కనిష్ఠాన్ని నమోదు చేస్తోంది. సోమవారం 43 పైసలు పడిపోయిన రూపాయి విలువ.. మరో జీవితకాల కనిష్ఠమైన 81.52కు చేరింది. అమెరికా డాలర్ బలపడటం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, దేశీయ ఈక్విటీలో ప్రతికూల పవనాల ఫలితంగా రూపాయి పతనమవుతోంది. భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండటం రూపాయి బలహీనతకు కారణమవుతోంది. అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని, ఆర్​బీఐ సైతం 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయి ఇప్పటికిప్పుడే కోలుకోకపోవచ్చని చెబుతున్నారు.

క్రిప్టోకరెన్సీల ధరలు..
బిట్​కాయిన్ ధర పడిపోయింది. ఒక బిట్​కాయిన్ విలువ రూ.10 వేలు తగ్గింది.ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,37,209 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,37,209
ఇథీరియం రూ.1,06,084
టెథర్​ రూ.81.47
బైనాన్స్​ కాయిన్​ రూ.22,219
రిపుల్ రూ.39.40
Last Updated :Sep 26, 2022, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details