తెలంగాణ

telangana

Stock Market: నష్టాల్లో మార్కెట్లు- 59 వేల దిగువకు సెన్సెక్స్​

By

Published : Sep 22, 2021, 9:26 AM IST

Updated : Sep 22, 2021, 9:41 AM IST

Stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

09:32 September 22

స్టాక్ మార్కెట్లు లాభాల నుంచి ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 40 పాయింట్లు తగ్గి.. 58,965 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల అత్యల్ప నష్టంతో 17,551 వద్ద కొనసాగుతోంది.

ఫార్మా, లోహ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లోకి జారుకునేందుకు కారణంగా తెలుస్తోంది.

  • ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.

09:08 September 22

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stock Market today) బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 50 పాయింట్ల లాభంతో 59,055 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 15 పాయింట్లకుపైగా పెరిగి 17,577 వద్ద కొనసాగుతోంది.

  • టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐటీసీ, ఎన్​టీపీసీ లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Sep 22, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details