తెలంగాణ

telangana

Stock Market today: లాభాల జోరు.. 61వేల మార్కును దాటిన సెన్సెక్స్

By

Published : Oct 14, 2021, 3:45 PM IST

stock market

స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 569 పాయింట్లు పెరిగి 61,300 వేల పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 176 పాయింట్ల లాభంతో 18,339 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీలు రెండూ జీవనకాల గరిష్ఠాలను తాకాయి.

స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 569 పాయింట్లు పెరిగి 61,305 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 176 పాయింట్ల లాభంతో 18,339 వద్దకు చేరింది.

తొలుత అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. వీటికి తోడు 21 కంపెనీలు నేడు ఫలితాలు వెల్లడించనున్నాయి అనే వార్తలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచింది. దీంతో సెన్సెక్స్​ తొలిసారిగా 61 వేల మార్కును దాటింది.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 61,353 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,978 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,350 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,248 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా స్టీల్​, ఎల్​ అండ్​ టీ, ఎన్​టీపీసీ షేర్లు లాభాలను ఆర్జించాయి.

హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా షేర్లు నష్టపోయాయి.

భారీగా పెరిగిన విప్రో షేరు..!

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో షేరు ధర భారీగా పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో జీవనకాల గరిష్ఠానికి చేరింది. నేటి ట్రేడింగ్‌లో 8 శాతం విలువ పెరిగి రూ.723.65 మార్కును తాకింది. ఐటీ సేవల్లో ఆదాయంలో 8.1శాతం వృద్ధి నమోదు కావడంతో మదుపరుల్లో ఆశలను పెంచింది. దీంతో షేరు గతంలో ఉన్న రూ.698.95 విలువను దాటేసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4లక్షల కోట్లను తాకింది. భారత్‌లో ఈ మార్కును తాకిన 13వ లిస్టెడ్‌ సంస్థగా విప్రో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details