తెలంగాణ

telangana

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- ఆగస్టులో 0.16%

By

Published : Sep 14, 2020, 2:42 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 0.16 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం భారీగా 1.27 శాతానికి పెరిగినట్లు కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది.

wpi in August
ఆగస్టులోపెరిగిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) ఆగస్టులో 0.16 శాతానికి పెరిగింది. గత ఏడాదితో ఆగస్టులో ఇది 1.17 శాతంగా ఉండటం గమనార్హం. ఆహార ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరల్లో పెరగుదలే ఇందుకు కారణంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆగస్టుకు ముందు నాలుగు నెలలు వరుసగా డబ్ల్యూపీఐ సూచీ -1.57 శాతం (ఏప్రిల్), -3.37 శాతం (మే), -1.81 శాతం (జూన్), -0.58 శాతం (జులై​)గా నమోదైంది.

ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం ఇలా..

  • ఆగస్టులో ఆహర పదార్థాల ద్రవ్యోల్బణం 3.84 శాతంగా నమోదైంది. బంగాళ దుంపల ద్రవ్యోల్బణం 82.93 శాతంగా ఉంది.
  • కూరగాయల ధరల టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.03 శాతంగా నమోదైంది. ఉల్లిపాయల టోకు ధరల ద్రవ్యోల్బణం -34.48 శాతంగా ఉంది.
  • ఇంధన, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.68 శాతానికి తగ్గింది. జులైలో ఇది 9.84 శాతంగా ఉండటం గమనార్హం.
  • తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం జులైతో పోలిస్తే.. ఆగస్టులో 0.51 శాతం నుంచి 1.27 శాతానికి చేేరింది.

ఇదీ చూడండి:పర్సనల్‌ లోన్​పై పన్ను మినహాయింపు పొందొచ్చా!

ABOUT THE AUTHOR

...view details