తెలంగాణ

telangana

Gold: సగం బంగారం ఆ దేశం నుంచే వస్తోంది!

By

Published : Jul 19, 2021, 4:54 AM IST

Updated : Jul 19, 2021, 6:28 AM IST

ఏటా భారత్ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో సగం స్విట్జర్లాండ్​ నుంచే వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం.. 34.6 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడిని దిగుమతి చేసుకుంది. దీంతో భారత్‌కు నాలుగో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది.

gold
బంగారం

భారత్‌ దిగుమతి చేసుకొంటున్న బంగారంలో దాదాపు సగం ఒకే దేశం నుంచి వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం భారత్‌ మొత్తం 34.6 బిలియన్‌ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోంది. దీనిలో 16.3 బిలియన్‌ డాలర్ల పుత్తడి స్విట్జర్లాండ్‌ నుంచే వచ్చింది.

నాలుగో పెద్ద దిగుమతి దారుగా..

కరోనా రాక ముందు ఏడాది కంటే 2020-21లో భారత్‌ 6.4 బిలియన్‌ డాలర్లు అధికంగా దిగుమతి చేసుకొంది. ఇక స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతులు కూడా 7.8శాతం 18.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో భారత్‌కు నాలుగో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది. గతంలో ఆ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. ఇక చైనా నుంచి దిగుమతుల్లో 0.07శాతం తగ్గుదల నమోదై 65.21 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

చైనాదే..

మొత్తం(అన్నిరకాల వస్తుసేవల) దిగుమతుల్లో ఇప్పటికీ అత్యధిక వాటా చైనాదే. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, యూఏఈ ఉన్నాయి. బంగారం వినియోగదారుల్లో ప్రపంచలోనే చైనా తర్వాతి స్థానంలో భారత్‌ ఉంది. స్విట్జర్లాండ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం శుద్ధికేంద్రం. ఇక్కడ అత్యున్నత శ్రేణి పుత్తడి లభిస్తుంది. దీంతో స్వర్ణ ప్రియులు స్విట్జర్లాండ్‌కే వైపే మొగ్గుతున్నారు.

అంతేకాదు.. అది పెద్ద రవాణ హబ్‌ కూడా. బంగారంపై పన్నును కూడా 12.5శాతం నుంచి 10శాతానికి తగ్గించింది. అందుకే కొంతకాలంగా అక్కడి నుంచి దిగుమతులు పెరుగుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. గతేడాది యూఏఈ నుంచి 4.19 బిలియన్‌ డాలర్లు, దక్షిణాఫ్రికా నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల విలువైన పుత్తడిని భారత్ కొనుగోలు చేసింది.

ఇదీ చదవండి:బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?

Last Updated : Jul 19, 2021, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details