తెలంగాణ

telangana

ఒడుదొడుకుల సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

By

Published : Apr 29, 2021, 9:25 AM IST

Updated : Apr 29, 2021, 3:52 PM IST

Stock markets live updates
స్టాక్​ మార్కెట్స్​

15:49 April 29

స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ అతి స్వల్పంగా 32 పాయింట్లు పెరిగి 49,765 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అత్యల్పంగా 30 పాయింట్ల లాభంతో 14,894 వద్దకు చేరింది.

  • బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, ఎస్​బీఐ, హెచ్​సీఎల్​టెక్​, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

13:34 April 29

ఆర్థిక షేర్ల అండ..

మిడ్ సెషన్​ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయంట్లకుపైగా లాభంతో 49,985 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా పెరిగి 14,945 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఆర్థిక, ఫార్మా రంగాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

  • బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, ఎం&ఎం, ఎల్​&టీ, ఎస్​బీఐ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:42 April 29

ఒడుదొడుకులు..

మదుపరుల అప్రమత్తతతో స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు.. కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 49 వేల 620 ఎగువన కొనసాగుతోంది. 

నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 14 వేల 850 దిగువన ఉంది. 

టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హిందాల్కో, బజాజ్​ ఫినాన్స్​ లాభాల్లో ఉన్నాయి. 

హీరో మోటోకార్ప్​, ఏషియన్​ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​ నష్టపోతున్నాయి. ​ 

09:50 April 29

లాభాల్లో మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 280, నిఫ్టీ 80 పాయింట్లు పెరిగాయి. 

08:22 April 29

లైవ్​: వరుసగా నాలుగోరోజు లాభాల్లో మార్కెట్లు

స్టాక్​మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 600పాయింట్లకుపైగా లాభపడి.. 50 వేల 330 ఎగువన కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి.. 15 వేల మార్కును దాటింది. 

లాభనష్టాల్లో..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టాటా స్టీల్​, హిందాల్కో, బజాజ్​ ఫిన్​సర్వ్​ లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​ టెక్​, సిప్లా డీలాపడ్డాయి. 

Last Updated : Apr 29, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details