తెలంగాణ

telangana

ఆర్థిక గణాంకాలు, క్యూ3 ఫలితాలే మార్కెట్లకు కీలకం!

By

Published : Jan 10, 2021, 11:17 AM IST

స్టాక్​ మార్కెట్లకు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల క్యూ3 ఫలితాలు కీలకంగా మారనున్నాయి. కేంద్ర బడ్జెట్​పై వెలువడే అంచనాలు, అంతర్జాతీయ పరిణామాలపైనా మదుపరులు దృష్టిసారించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

STOCKS OUTLOOK FOR THIS WEEK
స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాలు

స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలూ మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాలుగా ఉండనున్నట్లు విశ్లేషిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ వార్తలు, ఆర్థిక పునరుద్ధరణ ఆశల నేపథ్యంలో సూచీలు గత వారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. 2020-21 క్యూ3 ఫలితాల సీజన్​లో ఐటీ దిగ్గజం టీసీఎస్​ గతవారం ప్రకటించిన సానూకూల ఫలితాలు మదుపరుల్లో ఉత్సాహం పెంచాయి. విదేశీ మదుపరుల కొనుగోళ్ల మద్దతూ కొనసాగటం లాభాలకు కారణం.

ఈ వారంలో చూస్తే.. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్​ అంచనాలపై మదుపరులు దృష్టి సారించే వీలుందని మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్​ పరిశోధన విభాగాధిపతి సిద్ధార్థ్ ఖింకా అంటున్నారు.

ఈ వారం ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​ టెక్, విప్రో వంటి టెక్​ దిగ్గజాలు క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటిపైనా మదుపరులు దృష్టి సారించొచ్చని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అభిప్రాయడ్డారు.

ఇదీ చూడండి:లాభాలు కావాలంటే రిస్క్ చేయాలి గురూ!

ABOUT THE AUTHOR

...view details