తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

By

Published : Aug 17, 2021, 9:05 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు(Gold Rate Today) మంగళవారం స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

GOLD RATES
బంగారం ధరలు.

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.190 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ.355 ఎగబాకింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,750గా ఉంది.
  • వెండి ధర సైతం ఈ నగరాల్లో పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.65,625 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.85 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details