తెలంగాణ

telangana

పెరిగిన బంగారం, వెండి ధరలు

By

Published : Dec 28, 2020, 3:59 PM IST

పసిడి, వెండి ధరలు సోమవారం కాస్త పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.185 ఎగిసింది. వెండి ధర భారీగా పెరిగి పెరిగి.. కిలో ఏకంగా రూ.68 వేల మార్క్ దాటింది.

gold price rise today
పెరిగిన బంగారం ధర

బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.185 ఎగిసి.. రూ.49,757 వద్దకు చేరింది.

'అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కారణంగానే దేశీయంగానూ పసిడి ధరలు పుంజుకుంటున్నాయి.' అని విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర భారీగా కిలోకు(దిల్లీలో) రూ.1,322 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,156 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,885 డాలర్లకు పెరిగింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 26.32 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి:కొత్త ఏడాదిలో బంగారం ధరకు రెక్కలు!

ABOUT THE AUTHOR

...view details