తెలంగాణ

telangana

Gold Rate Today: ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

By

Published : Oct 24, 2021, 9:47 AM IST

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD AND SILVER PRICE TODAY
బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,377గా ఉంది. కిలో వెండి ధర రూ.66,995 వద్దకు చేరుకుంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,377గా ఉంది. కిలో వెండి ధర రూ.70 వేలకు చేరువైంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,377గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,995 వద్దకు చేరుకుంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,792 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరల పెంపు..

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో ఆదివారం లీటర్​కు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 36 పైసలు (Petrol price hike) చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.23కి చేరింది.

ఇవీ చూడండి:'డేటా వినియోగంలో మనమే అధికం.. నెలకు 12జీబీ వాడకం'

ABOUT THE AUTHOR

...view details