తెలంగాణ

telangana

త్వరలో డిజిటల్‌ కరెన్సీ: ఆర్​బీఐ

By

Published : Jul 23, 2021, 7:56 AM IST

త్వరలో టోకు, రిటైల్‌ విభాగాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు చేస్తోంది. దీన్ని దశల వారీగా ఆవిష్కరిస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవిశంకర్‌ తెలిపారు.

rbi
ఆర్​బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన సొంత డిజిటల్‌ కరెన్సీని దశల వారీగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమీప భవిష్యత్‌లో టోకు, రిటైల్‌ విభాగాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ పనిచేస్తోందని గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ టి. రవిశంకర్‌ తెలిపారు.

పలు దేశాల్లో టోకు, రిటైల్‌ విభాగాల్లో 'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)లు' ఇప్పటికే అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రైవేటు వర్చువల్‌ కరెన్సీ (వీసీ) తరహాలో ఉపయోగించుకునేలా దేశీయ సీబీడీసీని ఆర్‌బీఐ అభివృద్ధి చేస్తోందన్నారు.

ఆ భయం లేకుండా..

సార్వభౌమ మద్దతు లేని కొన్ని వర్చువల్‌ కరెన్సీల విలువల్లో ఏర్పడుతున్న 'హెచ్చుతగ్గుల భయం' లేకుండా సీబీడీసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల నగదుపై ఆధారపడడం తగ్గుతుందని, కరెన్సీ విలువకు, తయారీ ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరుగుతుందని, సెటిల్‌మెంట్‌ రిస్క్‌ కూడా పరిమితంగానే ఉంటుందని ఆయన వివరించారు.

డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి కాయినేజ్‌ యాక్ట్‌, ఫెమా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:కేంద్రం నిర్ణయంతో వారి జీతం భారీగా వృద్ధి!

ABOUT THE AUTHOR

...view details