ETV Bharat / business

కేంద్రం నిర్ణయంతో వారి జీతం భారీగా వృద్ధి!

author img

By

Published : Jul 22, 2021, 6:47 PM IST

ఉద్యోగులకు రెండేళ్ల తర్వాత వేతనాలను పెంచింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ 17 శాతం నుంచి​ 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో వారి నికర వేతనం ఎంత పెరగనుంది? దీని ద్వారా కలిగే అదనపు ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం.

How much salary hike to Govt Employees
ఉద్యోగులకు వేతనాల పెంపు ఎంత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(డియర్​నెస్​ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్​ (డియర్​నెస్ రిలీఫ్​) 17 నుంచి 28 శాతానికి పెంచుతూ కేబినెట్​ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పెంపును అమలు చేయాలని ఆర్థిక శాఖ కూడా.. సంబంధిత విభాగాలను ఆదేశించింది. కేబినెట్​ నిర్ణయం ప్రకారం.. జులై 1 నుంచే ఈ పెంపును అమలు చేయాలని సూచించింది.

'దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి అయిన.. 6 శాతం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా పెరిగిన ఆహార పదార్థాలు, వంట నూనెల ధరల నుంచి ఈ నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించొచ్చు' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక శాఖ ఆదేశాలతో... 48 లక్షలకుపైగా ఉద్యోగులకు.. 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ‌ ఖజానాపై వార్షికంగా రూ.34,401 కోట్లు అదనపు భారం పడనుంది.

మరిన్ని ముఖ్యమైన విషయాలు..

  • ఏడాదిన్నర కాలంగా.. కరోనా వైరస్​ సృష్టిస్తున్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేందుకు గానూ.. డీఏ​ను 17 శాతం నుంచి 28 శాతానికి (11 శాతం) పెంచింది కేంద్రం.
  • 2019 జులై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 17 శాతం డీఏనే పొందుతుండటం గమనార్హం.
  • నిజానికి 2020 జనవరి 1 నుంచే డీఏ పెంపు వర్తిస్తుందని ఉద్యోగులు ఆశించినప్పటికి.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
  • జులై 1 నుంచి పెరిగిన డీఏతో.. రూ.18,000 నెలవారీ వేతనం అందుకునే ఉద్యోగులు ఇక నుంచి 11 శాతం (రూ.5,040) అదనంగా పొందనున్నారు.
  • డీఏ పెంపుతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నికర వేతనంతో పాటు.. ప్రావిడెంట్ ఫండ్​, ట్రావెల్ అలవెన్స్​ (టీఏ), గ్రాట్యుటీ కూడా పెరగనుంది.

ఇదీ చదవండి:ఆ సంస్థలో చేరితే.. 'వర్క్​ ఫ్రం దుబాయ్​- బీఎండబ్ల్యూ బైక్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.