తెలంగాణ

telangana

మూడో త్రైమాసికంలో డీమార్ట్​కు లాభాల పంట

By

Published : Jan 8, 2022, 5:36 PM IST

DMART RESULTS: మూడో త్రైమాసికంలో డీమార్ట్ లాభాల బాట పట్టింది. డిసెంబర్​తో ముగిసిన క్యూ3లో నికరలాభం 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.9,217.76 కోట్లకు పెరిగింది. ఈ మేరకు వివరాలను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్​మార్ట్స్​ లిమిటెడ్ వెల్లడించింది.

RESULTS DMART
మూడో త్రైమాసికంలో డీమార్ట్​కు లాభాల పంట

DMART RESULTS: డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23 శాతం పెరిగి.. రూ.552.53 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.446.95 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ పేర్కొంది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్‌ ద్వారా 22.22 శాతం వృద్ధితో రూ.9,217.76 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.7,542 కోట్లు కావడం గమనార్హం.

ఇదే కాలంలో కంపెనీ ఖర్చులు 21.72 శాతం పెరిగినట్లు పేర్కొంది. రూ.8,493.55 కోట్లు ఖర్చులుగా కంపెనీ చూపించింది. గతేడాది ఇదే సమయంలో ఖర్చులు 6,977.88 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి:

Navi home loan: 'నావీ' కొత్త ఆఫర్‌.. 6.4% వడ్డీరేటుకే గృహరుణం

ABOUT THE AUTHOR

...view details