తెలంగాణ

telangana

హాస్టల్​ మెస్​కి తాళం... స్పందించని సిబ్బంది వైనం

By

Published : Jun 11, 2019, 10:28 AM IST

పేరుకు సికింద్రాబాద్​ పీజీ కళాశాల వసతి గృహం... కానీ అక్కడ అన్నీ సమస్యలే... ఎన్ని సార్లు ప్రిన్సిపల్​ దృష్టికి తీసుకెళ్లినా... ఏదో ఓ సాకుతో దాటేస్తారే తప్ప పరిష్కారం చూపరు. ఇప్పుడైతే ఏకంగా సగం మంది విద్యార్థులకే భోజనం పెట్టి... మెస్​ తాళం వేసుకున్నారు. అడిగితే ఎవరు స్పందించని దుస్థితి.

వసతి గృహ విద్యార్థుల ఆందోళన

వసతి గృహ విద్యార్థుల ఆందోళన

విద్యార్థులందరికీ భోజనం పెట్టకుండానే మెస్‌కు తాళం వేసి పోవటాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ పీజీ కళాశాల వసతి గృహ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ వసతి గృహంలో అనేక సమస్యలున్నాయని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌, కేర్ టేకర్ తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్​లోని డైనింగ్‌ హలు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. నాన్​బోర్డర్స్​ ఉన్నారంటూ వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భోజనం వండట్లేదని మండిపడ్డారు. కూరల్లో బల్లులు, బొద్దింకలు పడినా అలాగే వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వీసీ స్పందించి ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. విద్యార్థుల ఆవేదనకు స్పందించిన పోలీసులు... సొంత ఖర్చులతో భోజనం తీసుకొచ్చి పంచారు.

sample description

ABOUT THE AUTHOR

...view details