తెలంగాణ

telangana

అంధవిశ్వాసం.. గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు

By

Published : Jun 24, 2022, 2:28 PM IST

Woman cuts off her tongue: ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు విగ్రహం ముందే నాలుక కోసేసుకుంది. ఆ నాలుకను ఆ విగ్రహం పాదాల మీదకు విసిరేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో వెలుగుచూసింది. మూఢనమ్మకంతో ఆమె చేసిన ఈ పనికి అక్కడున్నవారు షాకయ్యారు.

మధ్యప్రదేశ్​
మధ్యప్రదేశ్​

Woman cuts off her tongue: మూఢనమ్మకాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, ఎన్​జీఓలు అవగాహన కల్పిస్తున్నా.. పలు ప్రాంతాల్లో ఇంకా అంధవిశ్వాసాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆలయం వద్దకు వచ్చిన ఓ యువతి తన నాలుకను కోసేసుకుంది. బడా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

ఇదీ జరిగింది: బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్​కుమారీ పటేల్​.. గురువారం తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని ఆ విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. యువతి వైఖరి చూసి తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న వారు షాకయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వైద్యులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఆలోచనతో ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి :మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి.. అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details