తెలంగాణ

telangana

కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్త.. సుత్తితో కొట్టి చంపిన భార్య

By

Published : Jan 29, 2022, 7:32 PM IST

woman killed her husband: అసభ్యంగా ప్రవర్తిస్తున్న భర్త చెర నుంచి కూతురిని కాపాడుకునే ప్రయత్నంలో సుత్తితో బలంగా కొట్టింది భార్య. తలకు తీవ్ర గాయాలైన అతడు అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.

wife murdered husband
కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్త

woman killed her husband: మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన భర్త నుంచి కూతురిని కాపాడేందుకు సుత్తితో బలంగా కొట్టింది ఓ భార్య. తలకు తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో గురువారం రాత్రి జరిగింది.

ఇదీ జరిగింది..

చెన్నై నగరంలో ఉంటున్న దంపతులకు 20 ఏళ్ల కూతురు, పదేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద ఎలాంటి పని చేయకుండా తాగుతూ తిరిగేందుకు అలవాటు పడ్డాడు. మద్యం మత్తులో ప్రతి రోజూ కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 27న రాత్రి 11 గంటలకు ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి.. సొంత కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కూతురిని రక్షించుకునే క్రమంలో భర్తపై సుత్తితో దాడి చేసింది అతని భార్య. తలకు తీవ్ర గాయమై అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత తల్లి, ఇద్దరు పిల్లల ఏడుపులు విని చుట్టు పక్కల వారు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఒట్టేరి పోలీసులు అక్కడికి చేరుకుని పోస్ట్​మార్టం నిమిత్తం నిందితురాలి భర్త మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసుకుని మహిళను అరెస్ట్​ చేశారు.

మరోవైపు.. తన కూతురిని కాపాడుకునే ప్రయత్నంలో భర్తపై దాడి చేసిందని.. నిందితురాలు విడుదలవుతుందని పలువురు మాట్లాడుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కొడుకును చంపి.. సైకిల్​పై తీసుకెళ్లి కాల్చేసిన తల్లిదండ్రులు!

ABOUT THE AUTHOR

...view details