తెలంగాణ

telangana

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 19 - డిసెంబర్‌ 25)

By

Published : Dec 19, 2021, 4:05 AM IST

Weekly Horoscope: ఈ వారం (డిసెంబర్‌ 19 - డిసెంబర్‌ 25) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
ఈ వారం రాశిఫలం

Weekly Horoscope: ఈ వారం (డిసెంబర్‌ 19 - డిసెంబర్‌ 25) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

అదృష్టయోగముంది. ఆశించింది దక్కుతుంది. ఉద్యోగంలో మనసు పెట్టి పనిచేయండి. త్వరగా లక్ష్యాన్ని చేరతారు. పొదుపు అవసరం. ఆశయ సాధనలో క్రమంగా పైకి వస్తారు. నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. మిత్రుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. తెలియని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా శ్రమించాలి. ధర్మం తప్పవద్దు. ఇంట్లోవారి సూచనలు అవసరం. సహనం రక్షిస్తుంది. దూషించిన వారే కీర్తిస్తారు. మంచి పేరు వస్తుంది. ముఖ్యకార్యాలను వాయిదా వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

శుభకాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆలోచనలకు కార్యరూపాన్నిస్తారు. ఇప్పుడు వేసే ప్రణాళికలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఆర్థిక విజయం ఉంది. వ్యాపారంలో విస్తరించేందుకు పరిస్థితులు సహకరిస్తాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయాలి. ఫలితం సంతృప్తినిస్తుంది. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. అవమానించే వారున్నారు. మిత సంభాషణ మేలుచేస్తుంది. మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఆంజనేయస్వామిని స్మరించండి, ఆశయం నెరవేరుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

కాలం అనుకూలం. ఏ పని ప్రారంభించినా న్యాయం జరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆత్మసంతృప్తినిచ్చే పనులు చేయండి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరవద్దు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

అదృష్టవంతులవుతారు. ఇబ్బందుల నుండి బయటపడతారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలం. ధైర్యంగా నిర్ణయం తీసుకుని అమలుచేయండి. సాహస కార్యాలు విజయాన్నిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఆర్థికస్థితి అనుకూలం. లక్ష్మీనారాయణ స్మరణ ఆనందాన్నిస్తుంది.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

మిశ్రమకాలం నడుస్తోంది. ఉద్యోగం అనుకూలం. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు. తగిన గుర్తింపూ గౌరవాలు లభిస్తాయి. ధనధాన్య లాభాలుంటాయి. ఆగిన పనులను పూర్తి చేయండి. ఉత్సాహం తగ్గకూడదు. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. స్పష్టంగా సమాధానాలివ్వాలి. దుర్గాదేవిని ఆరాధించండి, ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

వ్యాపార లాభముంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి. చంచలత్వం పనికిరాదు. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. అనవసరమైన ఆలోచనలను మనసులోకి రానీయవద్దు. కుటుంబసభ్యుల సూచనలతో మేలు జరుగుతుంది. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

మనోబలం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ తప్పదు. మిత్రుల ద్వారా ఒక పని అవుతుంది. తెలియని అవరోధాలు ఉన్నాయి. ప్రతి అడుగూ ఆచి తూచి వేయాలి. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గృహయోగం ఉంది. సుఖసంతోషాలు ఉన్నాయి. ఆశయం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. శివారాధనతో మనశ్శాంతి లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

శుభయోగముంది. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగం బాగుంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి భవిష్యత్తు సూచితం. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. వ్యాపారస్థితి మిశ్రమం. లక్ష్యంపై దృష్టి నిలపాలి. వ్యయభారం లేకుండా చూసుకోవాలి. కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తిచేయండి. తగినంత గుర్తింపు లభిస్తుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. స్వల్ప ధనలాభం. వారం మధ్యలో ఒక మంచి వార్త వింటారు. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లలితా సహస్రనామం పఠించండి, మనోబలం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి జీవితం లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. అధికార లాభముంటుంది. ఉద్యోగాభివృద్ధి సూచితం. అపార్థాలకు తావివ్వవద్దు. వ్యాపారలాభం స్వల్పం. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. నిబద్ధత గొప్పవారిని చేస్తుంది. నచ్చిన దైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details