తెలంగాణ

telangana

పంజాబ్, యూపీలో ప్రశాంతంగా పోలింగ్- 5 గంటల వరకు 60 శాతం..

By

Published : Feb 20, 2022, 7:00 AM IST

Updated : Feb 20, 2022, 5:41 PM IST

यूपी के तीसरे चरण का चुनाव 16 जिलों की 59 सीटों पर है. जिन जिलों में चुनाव है फिरोजाबाद, मैनपुरी, एटा, कासगंज, हाथरस, कानपुर, कानपुर देहात, औरैया, फर्रुखाबाद, कन्नौज, इटावा, झांसी, जालौन, ललितपुर, हमीरपुर और महोबा शामिल हैं. चलिए जानते हैं इन जिलों की विधानसभा सीटों और कुछ खास रोचक जानकारियों के बारे में.

third phase of up assembly
third phase of up assembly

17:40 February 20

సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​

ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ శాతాలు ఇలా ఉన్నాయి.

  • ఉత్తర్​ప్రదేశ్​- 57.44శాతం
  • పంజాబ్​- 63.44 శాతం

15:38 February 20

పోలింగ్​ శాతం ఇలా..

ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్​ శాతాలు ఇలా ఉన్నాయి.

  • ఉత్తర్​ప్రదేశ్​ - 48.81 శాతం
  • పంజాబ్​ - 49.81 శాతం

13:44 February 20

యూపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.8శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్​లో 34.1శాతం ఓట్లు పోలయ్యాయి.

13:07 February 20

పంజాబ్​లో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం మంది ఓటేశారు. అటు.. ఉత్తర్​ప్రదేశ్​లో ఇదే సమయానికి 21.18 శాతం ఓటింగ్ నమోదైంది.

12:36 February 20

పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాటియాలాలోని పోలింగ్ బూత్​లో ఓటేశారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన అమరీందర్.. పాటియాలాలో తన గెలుపు తథ్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగానూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మరో ప్రపంచంలో జీవిస్తోందని, పంజాబ్ నుంచి తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.

12:04 February 20

ఉత్తర్​ప్రదేశ్​ మూడో విడత ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం మంది ఓటేశారు.

11:13 February 20

పోలింగ్ బూత్​లో అఖిలేశ్ యాదవ్

ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైఫాయ్​లో తన భార్య డింపుల్ యాదవ్​తో కలిసి ఓటేసేందుకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ పోటీ చేస్తున్నారు.

10:09 February 20

ఉదయం 9 గంటల నాటికి ఓటింగ్

UP third phase polling: ఉత్తర్​ప్రదేశ్​లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.15 శాతం పోలింగ్ నమోదైంది.

మరోవైపు, పంజాబ్​లో ఉదయం 9 గంటల వరకు 4.8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

09:42 February 20

పంజాబ్ ఎన్నికలతో పాటు యూపీ మూడో విడత ఎన్నికల్లో ప్రజలంతా తప్పక ఓటేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువతతో పాటు తొలిసారి ఓటు వేస్తున్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

09:12 February 20

ఓటేసిన ములాయం సోదరుడు అభయ్ రామ్; పూజలు చేస్తున్న శివపాల్ యాదవ్

'అఖిలేశ్​దే గెలుపు'

యూపీలో అఖిలేశ్ యాదవ్ గెలుపు తథ్యమని ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 300కు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటేసే ముందు ఆలయంలో పూజలు చేశారు.

ములాయం మరో సోదరుడు అభయ్ రామ్ యాదవ్ సైతం ఓటేశారు. సైఫాయ్ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

మరోవైపు, యూపీ మంత్రి సతీశ్ మహాన కాన్పుర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

08:45 February 20

అవిభక్త కవలల ఓటు

అవిభక్త కవలలైన సోహ్నా, మోహ్నలు పంజాబ్​ ఎన్నికల్లో ఓటేశారు. అమృత్​సర్​ మనవాలాలోని బూత్ 101వ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అవిభక్త కవలలైనప్పటికీ ఇద్దరికీ ఓటు హక్కు ఉందని పీఆర్ఓ గౌరవ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి వీరిద్దరికీ ఓటుహక్కు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు వీరు ఓటేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని వివరించారు. దివ్యాంగ ఓటర్లకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.

07:59 February 20

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అన్ని స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

07:32 February 20

మూడో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్ ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచే ఓటేసేందుకు తరలి వచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య, ఫరూఖాబాద్ సదార్ నియోజకవర్గ అభ్యర్థి లూసీ ఖుర్షీద్​తో కలిసి వచ్చి ఆయన ఓటేశారు.

06:29 February 20

ఎన్నికలు లైవ్ అప్​డేట్స్

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.

మూడో దశ పోలింగ్ స్వరూపం...

  • మొత్తం స్థానాలు- 59
  • అభ్యర్థులు- 627 మంది
  • ఓటర్లు- 2.15 కోట్లు
  • కీలక నేతలు

ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో నిలిచిన కర్హల్ స్థానానికి మూడో విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ పోటీ చేస్తున్న జశ్వంత్​నగర్​కు సైతం పోలింగ్ జరుగుతోంది.

గత ఎన్నికల్లో ఇలా...

2017లో ఈ 59 స్థానాల్లో ఎవరు ఎన్ని గెలిచారంటే?

  • భాజపా- 49
  • సమాజ్‌వాదీ పార్టీ- 9
  • కాంగ్రెస్‌- 1

పంజాబ్ ఓటింగ్...

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్​ లోనికి ఓటర్లను అనుమతిస్తారు.

Last Updated :Feb 20, 2022, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details