తెలంగాణ

telangana

అయోధ్యలో ఇసుకతో రామాయణం చెప్పిన సైకతశిల్పి

By

Published : Nov 3, 2021, 10:16 AM IST

రామాయణంలోని సన్నివేశాలను వర్ణించేలా బొమ్మలు గీయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినా చేయొచ్చు. మరి ఆ ఇతిహాసంలోని సన్నివేశాలను ఇసుకపై ప్రతిబింబిచేలా సైకత శిల్పాన్ని రూపొందిచడం చాలా కష్టమే! అయితే.. యూపీలోని రూపేశ్​ సింగ్ అనే సైకత కళాకారుడికి మాత్రం ఈ పని చాలా ఈజీ. దీపోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్యలో.. తన సైకత శిల్పాలతో అబ్బురపరుస్తున్నాడు రుపేశ్​.

Sand artist
రామాయణం

ఇసుకపై రామాయణ గాథ

భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మహాకావ్యాన్ని ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా వర్ణించారు. తాజాగా.. దీపావళిని పురస్కరించుకుని.. రామాయణ ఘట్టాలను తన సైకత శిల్పాలతో వివరించే ప్రయత్నం చేశాడు ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యకు చెందిన రూపేశ్​ సింగ్ అనే కళాకారుడు. ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుండటం.. మరోవైపు దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతున్న తరుణంలో ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకట్టుకుంటున్న రామాయణ సైకత శిల్పం

రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన 'భరత్ మిలాప్'తోపాటు.. రాముడు, లక్ష్మణుడు, సీతకు సంబంధించిన సైకత శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు రూపేశ్​ సింగ్.

రామాయణ సైకత శిల్పం
రామాయణ సైకత శిల్పాలు

"పెయింటింగ్​ నేర్చుకోవడానికి అయ్యే ఖర్చును భరించలేక సైకత కళను ఎంచుకున్నా. సులువుగా లభించే ఇసుక ద్వారా కళాఖండాలను సృష్టించగలుగుతున్నా. ఇది ప్రత్యేకమైన కళ. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించాలనేది నా కల. ప్రజలు, మీడియా నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది."

-రూపేశ్​ సింగ్, సైకత కళాకారుడు

ప్రతి ఏడాది దీపావళికి ముందు అయోధ్యలో యూపీ ప్రభుత్వం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. 'దీపోత్సవ్'ను పురస్కరించుకుని 'రామ్ కీ పైడి'లో ఉన్న 28 ఘాట్ల వద్ద సుమారు తొమ్మిది లక్షల దీపాలను వెలిగించనున్నారు.

సైకత శిల్పి రూపేశ్ సింగ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details