తెలంగాణ

telangana

UP Polls: పోలింగ్​​ ప్రశాంతం.. 3 గంటల వరకు 46శాతం ఓటింగ్​

By

Published : Feb 27, 2022, 7:04 AM IST

Updated : Feb 27, 2022, 3:54 PM IST

UP Assembly Elections 2022
యూపీ ఎన్నికలు

15:53 February 27

పోలింగ్​​ ప్రశాంతం.. 3 గంటల వరకు 46శాతం ఓటింగ్​

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఐదో విడత పోలింగ్​.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. కొవిడ్​ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు మొత్తం 46.28 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

14:30 February 27

సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి గుల్షన్ యాదవ్​ కాన్వాయ్​పై దాడి

సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థి గుల్షన్ యాదవ్​ కాన్వాయ్​పై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గుల్షన్ యాదవ్​ తప్పించుకున్నారు. కానీ వాహనం ధ్వంసమైంది.

14:20 February 27

యూపీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పోలింగ్​లో పాల్గొన్నారు. అన్ని వయస్కులవారు ఓటు వేయడానికి ఆసక్తి కనబరిచారు. గాయంతో బాధపడుతున్నా.. ఓ వృద్ధురాలు స్ట్రెచర్​పై ఉండే పోలింగ్ కేంద్రానికి హాజరైంది. ఓటును వృథా చేయడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపింది.

13:52 February 27

యూపీ ఐదో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్​లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.00 గంటల వరకు 34.83 శాతం పోలింగ్ నమోదైంది.

11:53 February 27

యూపీ ఐదో విడత ఎన్నికల్లో ఓటు వేయడానికి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఉదయం 11.00 గంటల వరకు 21.39 పోలింగ్ శాతం నమోదైంది.

09:44 February 27

పోలింగ్​లో బారులు తీరిన జనం

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం 9.00 గంటల వరకు 8.02 శాతం పోలింగ్ నమోదైంది.

08:44 February 27

ప్రయాగ్​రాజ్​ ఎంపీ రీటా బహుగుణ జోషి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 300పైగా స్థానాలు గెలువాలని ఆకాంక్షించారు.

08:18 February 27

అలహాబాద్​ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యూపీ మంత్రి సిద్ధార్థనాథ్​ సింగ్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని అన్నారు. 300కు పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

08:17 February 27

అమేఠీ నుంచి బరిలోకి దిగుతున్న భాజపా అభ్యర్థి సంజయ్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'అమేఠీ ఎవరి కంచుకోట కాదు. అది గాంధీలైనా మరెవరైనా కావొచ్చు. ఈ ఎన్నికలు అణిచివేతదారులపై యుద్ధం.' అని అన్నారు.

08:12 February 27

సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్య గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కమలం గుర్తుకు పెద్ద సంఖ్యలో ఓట్లు రాబోతున్నాయని అన్నారు. యూపీలోని 24 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తామని చెప్పారు. అందని ఆకాశంలో ప్రగల్భాలు పలుకుతున్న అఖిలేశ్ యాదవ్ సైకిల్​ బంగాళాఖాతంలో పడిపోతుందని ఎద్దేవా చేశారు.

06:42 February 27

యూపీ ఐదో విడత పోలింగ్​

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఐదో విడత పోలింగ్​ ప్రారంభమైంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్​ జరగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఎన్నికలు జరగనున్న జిల్లాలు:సుల్తాన్‌పుర్, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రయిచ్‌, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఈ దశలో పోలింగ్ జరగనుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఆదివారమే ఓటింగ్​.

బరిలో ప్రముఖులు: ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్​​ నేత పల్లవి పటేల్​ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్ధార్థ నాథ్​ సింగ్ ​(అలహాబాద్​ పశ్చిమం), రాజేంద్ర సింగ్​(ప్రతాప్​గఢ్​), నంద గోపాల్​ గుప్తా నాడి (అలహాబాద్​ దక్షిణం), రమాపతి శాస్త్రి (మంకాపుర్​), 1993 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న రఘురాజ్​ ప్రతాప్​ సింగ్​ మరోమారు కుండా నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత ఆరాధన మిశ్రా పోటీలో ఉన్నారు.

Last Updated :Feb 27, 2022, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details