తెలంగాణ

telangana

36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు.. ఘనంగా పెళ్లి

By

Published : May 4, 2022, 8:25 PM IST

Unique Marriage In Bhagalpur: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు పెద్దలు. ఈ జంటను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకుంటే వారిద్దరు మరుగుజ్జులు. ఒకరి ఎత్తు 36 అంగుళాలు కాగా మరొకరి ఎత్తు 34 అంగుళాలు. వీరిద్దరి వివాహం చూసి ఫొటోలు దిగేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.

Bhagalpur Latest News
Bhagalpur Latest News

బిహార్​లో అరుదైన వివాహం.. వధువు ఎత్తు 34.. వరుడి ఎత్తు36 అంగుళాలు

Unique Marriage In Bhagalpur: బిహార్​ భగల్​పుర్​లో అరుదైన వివాహం జరిగింది. నవ్​గాచియాలోని గోపాల్​పుర్​ బ్లాక్​లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు. వరుడి ఎత్తు 36 అంగుళాలు కాగా.. వధువు ఎత్తు 34 అంగుళాలు. వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ అరుదైన వివాహాన్ని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ జంటతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

వివాహం అనంతరం వధువు, వరుడు
దండలు మార్చుకుంటున్న వధూవరులు

"నేను డ్యాన్స్​ పార్టీలో ఆర్టిస్ట్​గా పనిచేస్తాను. ఈ వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. నా భార్యను సంతోషంగా చూసుకుంటా. మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రానివ్వం."

-మున్నా భారతి, వరుడు

"నేను సర్కస్‌లో పనిచేస్తాను. మున్నాను చూడగానే నా చెల్లెలికి అతడే కరెక్ట్ అని అనుకున్నాను. అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిద్దరికి వివాహం నిశ్చయించాను"

- ఛోటూ ఛలియా, వధువు సోదరుడు

అభియా బజార్​లో నివసించే కిషోరి మండల్​కు మమతా(24) అనే కుమార్తె ఉంది. ఆమె ఎత్తు 34 అంగుళాలు. బిందేశ్వరి మండల్​ కుమారుడు మున్నా భారతి(26) ఎత్తు 36 అంగుళాలు. మున్నాను చూసిన మమతా సోదరుడు తన చెల్లిలికి సరిపోతాడనుకుని వారి కుటుంబంతో మాట్లాడాడు. మున్నా కుటుంబం సైతం ఒప్పుకోవడం వల్ల ఇద్దరు సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు.

ఇదీ చదవండి:పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్​!

ABOUT THE AUTHOR

...view details