తెలంగాణ

telangana

Booster Dose: రెండో డోస్​ తీసుకున్న 9 నెలలకు బూస్టర్!

By

Published : Dec 10, 2021, 2:12 PM IST

Booster Dose: ఒమిక్రాన్ వ్యాప్తి​ నేపథ్యంలో బూస్టర్​ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు పేర్కొంది.

Booster Dose in India
Booster Dose in India

Booster Dose: గత కొద్దికాలంగా బూస్టర్ డోసుల పంపిణీపై జరుగుతున్న చర్చ.. ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత జోరందుకుంది. కేంద్రం కూడా ఇదే అంశంపై గురువారం సమావేశం నిర్వహించింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. పలు రకాల వేరియంట్లపై టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. 100కు పైగా దేశాలు భారత్ అందిస్తున్న టీకా ధ్రువపత్రాన్ని అంగీకరిస్తున్నాయని వివరించారు.

ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. దీనిలో ఒమిక్రాన్, కొవిడ్ సంబంధిత అంశాలను వెల్లడించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ను ఎదుర్కోవడం 'దొంగా-పోలీసు' ఆట లాంటిదని, అధికారులు వైరస్‌ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ప్యానెల్ సభ్యులు సూచించినట్లు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ ఇప్పటివరకు 57 దేశాలకు విస్తరించగా.. ఈ రకం కేసులు 2,300పైగా నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనా సెకండ్​ వేవ్​లో వైద్యం కోసం లంచం ఇచ్చిన 40% ప్రజలు!

ABOUT THE AUTHOR

...view details