తెలంగాణ

telangana

సంక్రాంతి ఎఫెక్ట్ - పంతంగి టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 11:36 AM IST

Traffic Jam at Panthangi Toll Plaza Today : తెలంగాణలో సంక్రాంతి పండుగ సందడి షురూ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఒక్కసారిగా వస్తున్న నగరవాసులతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్​స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఆంధ్రా వెళ్లే వారితో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

Traffic Jam at Hyderabad Vijayawada Highway
Traffic Jam at Hyderabad Vijayawada Highway

సంక్రాంతి ఎఫెక్ట్ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

Traffic Jam at Panthangi Toll Plaza Today :సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ వాసులు పల్లెబాట పట్టారు. నేటి నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరమంతా ఊరెళ్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో (Sankranti Rush in Telangana) కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ముఖ్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Traffic Jam at Hyderabad Vijayawada Highway : మరోవైపు కొర్లపహాడ్‌, ఏపీలోని చిలకల్లు, కీసర టోల్‌ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొని వాహనదారులు చాలా సేపు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికాలు స్పందించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా, చకా చకా ముందుకు సాగేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో టోల్‌ వసూలులో ఫాస్టాగ్‌ విధానం అమలులోకి రాక ముందు కొన్ని గంటల పాటు వేచి చూసే వారు. కానీ ప్రస్తుతం ఫాస్టాగ్‌ విధానంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది. నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రద్దీ మొదలైందని అధికారులు చెబుతున్నారు. శనివారం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించనున్నట్లు వారు పేర్కొన్నారు.

Sankranti Rush: జంటనగరాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రాంగణాలు

Sankranti Rush At Panthangi Toll Plaza 2024 :హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి మొత్తం 273 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అన్ని టోల్‌ ప్లాజాల కంటే ఎక్కువగా వాహనాల రద్దీ పంతంగి టోల్‌ ప్లాజా వద్దనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పంతంగి టోల్‌గేట్‌ వద్ద 16 టోల్‌ చెల్లింపు కేంద్రాలు ఉండగా వాటిలో విజయవాడ వైపు 10 గేట్లను తెరిచారు. మిగతా టోల్‌గేట్ల వద్ద 12 టోల్‌ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు మొదటి టోల్‌గేట్‌ పంతంగిదే వస్తుంది. ఇక్కడ టోల్‌ చెల్లించడానికి వాహనాలు ఎక్కువసేపు నిలుస్తున్నాయి.

మొదలైన సంక్రాంతి సందడి - కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

Sankranti Festival Effect 2024 : ఈ టోల్‌ ప్లాజా దాటితే తర్వాత అంతలా రద్దీ ఉండదు. ఎందుకంటే కొన్ని వాహనాలు నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తాయి. కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ దాటాక మరికొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మిగతావి విజయవాడ వైపు బయల్దేరుతాయి. ఇలా వాహనాలు మూడు రూట్లలో వెళ్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ కాస్తా తక్కువగా ఉండనుంది. తద్వారా మిగతా రెండు టోల్‌ప్లాజాల (Rush at Toll plazas)వద్ద పెద్ద మొత్తంలో రద్దీ ఉండదు. కానీ తిరుగు ప్రయాణంలో మూడు ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలు, హైదరాబాద్‌కు వెళ్లాలంటే మరల పంతంగి టోల్‌గేట్‌ మీదుగానే వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఇక్కడ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.

పంతంగి టోల్‌ప్లాజా వాహనాల రాకపోకలు ఇలా

  • సాధారణ రోజుల్లో 38,000లు
  • వారాంతపు దినాల్లో 40,000లకు పైగా..
  • గత సంక్రాంతికి ముందు రోజూ రాకపోకలు 60,000లు, కానీ ఈసారి ఇంకా ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది.

సంక్రాంతికి ఊరికెళ్లేదెలా?.. కిక్కిరిసిపోతున్న రైల్వే, బస్‌ స్టేషన్లు

ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు

ABOUT THE AUTHOR

...view details