తెలంగాణ

telangana

కర్ణాటకలో ఏసీబీ విస్తృత సోదాలు

By

Published : Mar 9, 2021, 12:03 PM IST

Updated : Mar 9, 2021, 12:41 PM IST

ఏసీబీ అధికారులు కర్ణాటకలో విస్తృత సోదాలు చేపట్టారు. మంగళవారం ఒకేసారి తొమ్మిది మంది అధికారులకు చెందిన 28 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

Today ACB has conducted raids and search has started  in 28 places against 9 officers in 11 districts
కర్ణాటకలో 28ప్రాంతాల్లో ఏసీబీ విస్తృత సోదాలు

కర్ణాటక అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఒకేసారి 9 మంది అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి కర్ణాటలోని 11 జిల్లాల్లో 9 మంది అధికారులకు చెందిన 28 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా రేంజ్‌ల ఎస్పీల పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ అధికారులంతా వేర్వేరు విభాగాలు, శాఖల్లో, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

ఏసీబీ సోదా చేసిన ఓ అధికారి ఇల్లు
ఏసీబీలో సోదాల్లో వెలుగు చూసిన నగదు, ఆభరణాలు

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఆయా అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ నుంచి టౌన్‌ ప్లానింగ్ విభాగం ఇంజనీరింగ్ అధికారుల వరకూ ఈ అధికారుల్లో ఉన్నారు. వారి ఆస్తుల వివరాలు లెక్కతీసే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

ఏసీబీ దాడులు చేసిన అధికారుల వివరాలు..

  • 1. కృష్ణగౌడ, ఏజీఓ
  • 2. హనుమంత శివప్ప చిక్కన్నవర, ఎలక్ట్రికల్​ ఇన్​స్పెక్టర్​
  • 3. సుబ్రమణ్య కే. వద్దర్​, టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరక్టర్
  • 4. మునిగోపాల్​ రాజు, సూపరింటెండెంట్​, ఇంజినీర్
  • 5. చెన్నవీరప్ప. ఎఫ్​డీఏ, ఆర్​టీఓ కార్యాలయం
  • 6. రాజు పత్తార్, అకౌంట్​ అధికారి
  • 7. విక్టర్​ సిమోన్​, పోలీస్​ ఇన్​స్పెక్టర్​
  • 8. కే. సుబ్రమణ్యమ్, జూనియర్ ఇంజినీర్​

ఇదీ చదవండి :ఉపాధి పేరుతో తీసుకెళ్లి యువతిపై 11మంది అత్యాచారం

Last Updated : Mar 9, 2021, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details