తెలంగాణ

telangana

ట్రాన్స్​జెండర్ సంకల్పం.. కుటుంబం దూరమైనా.. రాష్ట్రంలోనే తొలి లాయర్​గా..

By

Published : Dec 15, 2022, 10:28 AM IST

ట్రాన్స్​జెండర్స్ అంటేనే అందరూ భిన్నాభిప్రాయంతో ఉంటారు. అలాంటిది ఒక ట్రాన్స్​జెండర్.. సమాజంలోని అడ్డంకులను ఎదురించి న్యాయవాదిగా మారారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతూ లాయర్ అయిన తొలి ట్రాన్స్​జెండర్​గా చరిత్ర సృష్టించారు. కుటుంబ సహకారం లేకపోయినా కష్టపడి చదువుకుని ఔరా అనిపించారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చాటి చెప్పారు.

first transgender lawyer
లాయర్​గా లీగల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందుకుంటున్న కన్మణి

సమాజాన్ని ఎదురించి కుటుంబ సహకారం లేకపోయినా లాయర్​గా ఎదిగారు తమిళనాడుకు చెందిన ట్రాన్స్​జెండర్ కన్మణి. ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో పట్టు వదలకుండా కష్టపడి చదివి జీవితంలో విజయం సాధించారు. చెన్నైకి చెందిన కన్మణి.. ఆ రాష్ట్ర మొదటి ట్రాన్స్​జెండర్ న్యాయవాదిగా రికార్డుకెక్కారు. ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివిన తొలి ట్రాన్స్‌జెండర్ లాయర్​గా లీగల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందుకున్నారు.

.

కుటుంబ నేపథ్యం:
కన్మణి, 2000 సంవత్సరంలో చెన్నైలోని వాల్​చెర్రీలో అబ్బాయిగా జన్మించారు. కన్మణికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. విద్యాభ్యాస సమయంలో కన్మణి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపించాయి. దీంతో కన్మణిని ఆ కుటుంబం దూరం పెట్టడం ప్రారంభించింది. అయితే, ఇంటర్ వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉండి చదువుకుంది కన్మణి. కానీ, ఆ తర్వాత ఆమెను ఇంట్లో ఉండేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 2017లో 12వ తరగతి పూర్తి అయిన తర్వాత కన్మణి వారి కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోయారు. తర్వాత ఓ వసతి గృహంలో ఉండి పుదుచ్చేరి చెంగల్​పట్టు జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ​ లా కళాశాలలో 5సంవత్సరాల 'లా' కోర్సును పూర్తి చేశారు.

ట్రాన్స్​జెండర్​ లాయర్​ కన్మణి

గర్వంగా ఉంది:
కుటుంబసభ్యులు తనను అంగీకరించనప్పటికీ తోటి విద్యార్థులు, అధ్యాపకులు తనకు సహకరించారని కన్మణి గర్వంగా చెబుతున్నారు. సివిల్ జడ్జి కావడమే తన తదుపరి లక్ష్యం అని తెలిపారు. సివిల్ జడ్జి పరీక్షలో విజయం సాధించాలనే లక్ష్యంతో వేలచ్చేరిలోని చండూరు లా కేంద్రంలో శిక్షణ పొందుతున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details