తెలంగాణ

telangana

Three Boys Died: రామగుండంలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

By

Published : Apr 14, 2023, 2:31 PM IST

Updated : Apr 14, 2023, 7:18 PM IST

Three boys died
Three boys died

14:22 April 14

పెద్దపల్లి జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

Three Boys Died: ఆముగ్గురు విద్యార్థులు ఈరోజు సెలవు కావడంతో సరదాగా ఈత నేర్చుకుందామని చెరువు వద్దకు వెళ్లారు. అవే వారికి చివరి క్షణాలయ్యాయి. ఒక్కొక్కరుగా మగ్గురు నీళ్లలో మునిగి విగతజీవులుగా మారారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. రామగుండం పీకే రామయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. న్యూ పోరెట్‌పల్లి గ్రామానికి చెందిన సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌లు.. స్థానిక జడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

ఈ క్రమంలోనే సెలవురోజు సరదాగా ఈత నేర్చుకుందామని సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు ప్రమాదవశాత్తు నీట మునిగారు. వీరితో పాటు వెళ్లిన మరో బాలుడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న వారు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో.. గాలింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గోదావరిఖని ఆసుపత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి. ఉన్నత శిఖరాలకు చేరుతారనుకున్న తమ ఆశల సౌధాలు.. చెరువులో మరణించారన్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న తీరును చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు

'దేశ వ్యతిరేకులని ముద్ర వేయడం ప్రమాదకరం.. ప్రజాస్వామ్యం ఖతం!'

Last Updated :Apr 14, 2023, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details