తెలంగాణ

telangana

విగ్రహానికి వైద్యం చేయలేదని ఆగ్రహం- గోడకేసి తలను బాదుకుని..

By

Published : Nov 19, 2021, 7:28 PM IST

జిల్లా ఆసుపత్రికి శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి చెయ్యి విరిగిన 'లడ్డూ గోపాల్'​తో వచ్చాడు. 'లడ్డూ గోపాల్'​కు వెంటనే కట్టుకట్టాలని డిమాండ్​ చేశాడు. అందుకు సిబ్బంది ఒప్పుకోకపోయేసరికి నానా హంగామా చేశాడు. చివరికి అతడిని శాంతపరచడానికి చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...

agra news latest
'లడ్డూగోపాల్'​కు కట్టుకట్టలేదని ఆగ్రహం- గోడకేసి తలను బాదుకుని..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి డాక్టర్లను వింత డిమాండ్​ చేశాడు. వెంట తెచ్చుకున్న లడ్డూ గోపాల్​ విగ్రహానికి చెయ్యి విరిగిందని.. వెంటనే దానికి ప్లాస్టర్​తో కట్టుకట్టాలన్నాడు. ఇందుకు సంబంధిత డాక్టర్​ తిరస్కరించేసరికి కోపం పట్టలేకపోయిన అతను తలను గోడకేసి బాదుకున్నాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ​

లడ్డూ గోపాల్​ విగ్రహంతో లేఖ్​ సింగ్​

ఇదీ జరిగింది..

లేఖ్​ సింగ్ అనే​ ఈ పూజారి చేతి నుంచి శుక్రవారం ఉదయం లడ్డూ గోపాల్​ విగ్రహం జారి పడిపోయింది. ఈ క్రమంలో ఆ విగ్రహం చెయ్యి విరిగింది. దీంతో వెంటనే ప్రతిమతో సహా అతను జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. లడ్డూ గోపాల్​ చేతికి చికిత్స చేయాలని డిమాండ్​ చేశాడు. సంబంధిత డాక్టర్​ అందుకు తిరస్కరించారు. దీంతో కోపం పట్టలేక గోడకేసి తలను బాదుకుని గాయపరచుకున్నాడు. మిగతా డాక్టర్లు వచ్చి నచ్చజెప్పినా అతను పట్టు విడవలేదు.

హిందూ మహాసభ సభ్యుల రాకతో..

పూజారి పరిస్థితి గురించి తెలుసుకున్న హిందూ మహా సభ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని అతనికి సర్దిచెప్పారు. అతను తృప్తి చెందేందుకు ఆసుపత్రి చీఫ్​ మెడికల్​ ఆఫీసర్ అశోక్​ అగర్వాల్​​ విగ్రహానికి ప్లాస్టర్​తో కట్టుకట్టారు. లేఖ్​ సింగ్​ హార్ట్​ పేషెంట్​ అని.. అందుకే అతడిని ఇబ్బంది పెట్టకుండా విగ్రహానికి కట్టుకట్టామని అశోక్​ తెలిపారు.

విగ్రహానికి కట్టుకడుతున్న వైద్య సిబ్బంది
లడ్డూ గోపాల్​ విగ్రహం

'దేవుడికి నొప్పిగా ఉంటుంది'

డిమాండ్​ తీర్చిన తర్వాత కూడా అతను పూర్తిగా సంతృప్తి చెందలేదు. కట్టుకట్టేముందు విగ్రహానికి మత్తుమందు ఇవ్వలేదని.. దీని వల్ల దేవుడికి బాగా నొప్పి కలిగి ఉండొచ్చని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి :ఈ దున్నపోతు ధర రూ.24 కోట్లు- విదేశాలకు వీర్యం!

ABOUT THE AUTHOR

...view details