Sweet basil uses: ఈ ఒక్క ఆకు.. పంచదారతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉంటుంది. మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం. అదే స్వీట్ తులసి. అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్క ఇప్పుడు కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందింది. కన్నూర్ జిల్లాకు చెందిన ఓ రైతు దీనిని సాగు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి మొక్కల కోసం ఆర్డర్లు వస్తున్నాయంటే.. దాని ప్రాముఖ్యం అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలోని పరియారమ్ గ్రామానికి చెందిన కేవీ షాజీ.. కొద్ది రోజుల క్రితం ఈ మొక్కలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆకర్షితుడయ్యారు. దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. త్రివేండ్రం నుంచి కొన్ని మొక్కలను తీసుకొచ్చి.. తన భూమిలో పెంచడం ప్రారంభించారు. రక్తంలోని చక్కెర స్థాయిని, బీపీని నియంత్రించే మంచి గుణాలు ఈ స్వీట్ తులసిలో ఉన్నాయని చెబుతున్నారు షాజీ.