తెలంగాణ

telangana

పరీక్షలో స్టూడెంట్ హైటెక్ కాపీ.. ఏం చేశాడో తెలిస్తే షాక్​!

By

Published : Apr 6, 2022, 12:51 PM IST

Updated : Apr 6, 2022, 1:10 PM IST

Haryana Student Cheating In Exam: అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో పాస్​ అవ్వడానికి స్లిప్​లు పెట్టుకుని వెళ్లి పని కానిస్తుంటారు. అయితే తాజాగా హరియాణాలో ఓ విద్యార్థి ఆంగ్ల పరీక్షలో పాస్​ అయ్యేందుకు స్లిప్​లు కాకుండా హైటెక్​ కాపీ చేసి దొరికిపోయాడు. ఆ విద్యార్థి చేసిన పనికి అధికారులు​ షాకయ్యారు. ఇంతకీ ఆ విద్యార్థి ఏ చేశాడంటే?

haryana student cheated in exams
haryana student cheated in exams

పరీక్షలో స్టూడెంట్ హైటెక్ కాపీ

Haryana Student Cheating In Exam: హరియాణాలోని ఫతేహాబాద్​లో జరుగుతోన్న బోర్డు పరీక్షల్లో 'కాపీ క్యాట్'​లను ఫ్లయింగ్​ స్క్వాడ్ పట్టుకుంది. సోమవారం జరిగిన ఆంగ్ల పరీక్షలో చాలా మంది విద్యార్థులు పట్టుబడ్డారు. అందులో ఓ విద్యార్థి చేసిన పనికి స్క్వాడ్​ అవాక్కయింది. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి తీరు అనుమానాస్పదంగా కనిపించడం వల్ల అధికారులు ఆరా తీశారు. అప్పుడు విషయం మొత్తం బయటకు వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పట్టుబడిన విద్యార్థి తన పేపర్​ ప్యాడ్​లోనే మొబైల్​ ఫోన్​ను అమర్చుకుని వచ్చి కాపీ కొడుతున్నాడు.

మాస్ కాపీయింగ్ బయటపడిందిలా.. పరీక్ష ప్రారంభమైన కాసేపటికీ ఎగ్జామ్‌ సెంటర్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది. వారు పూర్తిగా తనిఖీ చేయగా.. పరీక్షలు రాస్తున్న వారిలో ఒక విద్యార్థి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడం వల్ల అధికారులు తనిఖీ చేశారు. అప్పుడే బయటపడింది అసలు విషయం. ఆ విద్యార్థి తన పేపర్​ ప్యాడ్​లోనే మొబైల్​ అమర్చుకుని వచ్చాడు. అది చూసిన ఫ్లయింగ్​ స్క్వాడ్​ ఉలిక్కిపడింది. మొబైల్​ బయటకుతీసి చెక్​ చేయగా.. గ్యాలరీలో ఇంగ్లిష్​కు చెందిన ప్రశ్నలు, సమాధానాలు కనిపించాయి. దీంతో మొబైల్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ విద్యార్థిని డిబార్ చేశారు. మరికొంతమంది విద్యార్థులు కూడా స్లిప్​లతో దొరికిపోగా.. వారిపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:ప్రాణం తీసిన వివాదం.. గర్భిణీని మూడంతస్తుల పైనుంచి తోసేసి హత్య

Last Updated :Apr 6, 2022, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details