తెలంగాణ

telangana

మహారాష్ట్ర, కర్ణాటకలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో భారీగా..

By

Published : Jan 17, 2022, 9:01 PM IST

Corona cases in India: భారత్​లో వివిధ రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే కేరళలో కొవిడ్​ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క రోజే 22 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు.

State Wise Corona cases in India
State Wise Corona cases in India

Corona cases in India: దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కర్ణాటకలో రోజువారి కొవిడ్ కేసులు దిగొచ్చాయి. కొత్తగా 27,156 కేసులు నమోదవగా.. 14 మంది చనిపోయారు. 7,827 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 2,17,297కు తగ్గింది.

మహారాష్ట్రలోనూ కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 31,111 మందికి వైరస్​ సోకింది. మరో 24 మంది మృతి చెందారు. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 2,67,334కు చేరింది. అయితే 122 మందికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలింది.​

దేశంలోని ప్రధాన నగరాలు దిల్లీ, ముంబయిలో కొవిడ్​ బాధితులు భారీగా తగ్గారు. దిల్లీలో తాజాగా 12,527 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలగా.. 24 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 27.99 శాతంగా ఉంది.

ముంబయిలో కొత్తగా 5,956 కేసులు నమోదవగా.. 12 మంది చనిపోయారు. దీంతో నగరంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 50,757కు చేరింది.

మరోవైపు కేరళలో కొత్తగా 22,946 మందికి వైరస్​ సోకింది. మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారంతో పోల్చితే.. 182 శాతం కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసుల వివరాలు..

ప్రాంతం కొత్త కేసులు మరణాలు
మహారాష్ట్ర 31,111 24
కర్ణాటక 27,156 14
దిల్లీ 12,527 24
కేరళ 22,946 72(సవరించిన తర్వాత)
ఉత్తర్​ప్రదేశ్ 15,622 09
బంగాల్​ 9,385 33
ఒడిశా 10,489 03
రాజస్థాన్​ 9,236 05
మధ్యప్రదేశ్ 6,970 --
ఆంధ్రప్రదేశ్​ 4,108 --
జమ్ముకశ్మీర్​ 2,827 05
తెలంగాణ 2,447 03
  • బంగాల్​లో కొవిడ్​ ఆంక్షలను సడలించారు. కొన్ని షరతులతో వ్యాయామశాలలు తెరుచుకునేందుకు, జాతరలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

ఇదీ చూడండి:ఫ్రెండ్స్​తో కలిసి భార్యను రేప్​ చేసిన నిందితుడి ఫాంహౌస్​ కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details