తెలంగాణ

telangana

'రైతుల వెంటే కాంగ్రెస్.. సభలో పోరాటం ఆగదు'

By

Published : Dec 8, 2021, 10:58 AM IST

Sonia at CPP meet: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ద్రవ్యోల్బణం, రైతుల మరణాలపై మాట్లాడిన సోనియా.. సర్కారు తీరును తప్పుబట్టారు. సరిహద్దు సమస్య, పొరుగుదేశాలతో సంబంధాలపై సభలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

sonia gandhi news
సోనియా గాంధీ న్యూస్

Sonia Gandhi CPP meet: రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వీరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని వ్యాఖ్యానించారు. దిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సోనియా.. ధరల పెరుగుదలతో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా

"వ్యవసాయ రంగంలోని సమస్యలపై పార్లమెంట్​లో కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. రైతులకు, వారి డిమాండ్లకు మద్దతుగా నిలుస్తుంది. కనీస మద్దతు ధర సహా ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం విషయంలో కాంగ్రెస్.. అన్నదాతల పక్షానే ఉంటుంది."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

Sonia Gandhi on Rajya Sabha suspensions

రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని సోనియా తప్పుబట్టారు. సస్పెన్షన్ ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎంపీలకు సానుభూతి ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సరిహద్దు సమస్యపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. పొరుగుదేశాలతో సంబంధాలపై సభలో చర్చించాలని అన్నారు.

సమావేశానికి హాజరైన సభ్యులు

Sonia gandhi on Nagaland Army killings

నాగాలాండ్​లో పౌరులపై కాల్పుల ఘటనను ఖండించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. దీనిపై ప్రభుత్వం కేవలం విచారం వ్యక్తం చేస్తే సరిపోదని అన్నారు. ఇలాంటి విషాదకరమైన పరిణామాలు మరోసారి చోటుచేసుకోకుండా విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీలు

వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సర్కారుకు సూచించారు సోనియా. దేశంలోని 60 శాతం మంది అర్హులకు సత్వరమే టీకా పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.

ఇదీ చదవండి:రుణ భారతం.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల​పై పెరిగిన భారం

ABOUT THE AUTHOR

...view details