తెలంగాణ

telangana

రాడ్డుతో కొట్టి తండ్రి దారుణ హత్య.. శరీరాన్ని 30 ముక్కలు చేసి.. బోరుబావిలో..

By

Published : Dec 13, 2022, 1:36 PM IST

Updated : Dec 13, 2022, 4:00 PM IST

తాగొచ్చి గొడవ పడుతున్న తండ్రిని రాడ్డుతో​ కొట్టి హత్య చేశాడు ఓ వ్యక్తి. శరీరాన్ని 30 ముక్కలు చేసి బోరుబావిలో పడేశాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, బకాయిలు కట్టాలని అడిగినందుకు అధికారులను కత్తితో బెదిరించింది ఓ మహిళ.

son killed his father and cut it 30 pieces
తండ్రిని చంపి 30 ముక్కలు చేసిన కొడుకు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య ఘటన తరహా హత్య మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. తండ్రిని చంపి 30 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ బోరుబావిలో పడేశాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

మృతుడు, పరశురామ్ కులాలి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పరశురామ్ కులాలి (54). అతని కొడుకు విఠల్ కులాలి (20). వీరు బాగల్‌కోట్ జిల్లా ముధోలో నివాసం ఉంటున్నారు. పరుశురామ్​ రోజు తాగొచ్చి కొడుకును కొట్టేవాడు. అసభ్యంగా తిట్టేవాడు. ఇంట్లో రోజు ఇదే తంతు జరుగుతూ ఉండేది.

నిందితుడు, విఠల్ కులాలి

ఈ క్రమంలోనే.. డిసెంబర్​ 6వ తేదిన పరశురామ్ ఎప్పటిలాగే తాగొచ్చి కొడుకుతో గొడవ పడ్డాడు. దీంతో కోపం పట్టలేక.. తండ్రిని రాడ్డుతో కొట్టి చంపాడు విఠల్. అనంతరం మృతదేహాన్ని తీసుకుని తమ పొలానికి వెళ్లాడు. శవాన్ని బోరుబావిలో పడేసేందుకు ప్రయత్నించాడు. బోరుబావి రంధ్రం చిన్నగా ఉండటం వల్ల మృతదేహం అందులో పట్టలేదు. దీంతో శవాన్ని గొడ్డలితో 30 ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఆ భాగాలను బోరుబావిలో పడేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా ప్రవర్తించాడు.

మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యాలు

కొద్ది రోజుల తరువాత బోరుబావిలో నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. అనంతరం వారు సమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయగా నిజం బయటకు వచ్చింది. విఠల్ కులాలి తండ్రిని చంపి బోరుబావిలో పడేసినట్లుగా పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసుకుని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. జేసీబీ సాయంతో బోరుబావిని తవ్విన పోలీసులు.. శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్​మార్టం పరీక్షల కోసం వాటిని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యాలు

కత్తితో అధికారులను బెదిరించిన మహిళ..
కర్ణాటక మైసూరులోని సత్గల్లీ బస్సు డిపోలో ఓ మహిళ కత్తితో వీరంగం సృష్టించింది. డిపోలోని వ్యాపార సముదాయానికి సంబంధించిన బకాయిల విషయమై మహిళకు.. ఆర్టీసీ అధికారులకు వివాదం జరిగింది. షఫిక్‌ అహ్మద్‌ అనే వ్యక్తి 12 ఏళ్లకు డిపోలోని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. డిసెంబర్‌ 10నాటికి ఆ కాంట్రాక్టు పూర్తైంది. అతడు బాకీ పడి ఉన్న కోటి 80 లక్షల రూపాయలను చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా వెళ్లి నిలదీయగా... ఆగ్రహించిన అహ్మద్‌ భార్య అధికారులపై దుర్భాషలాడుతూ కత్తితో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అహ్మద్‌, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Dec 13, 2022, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details