తెలంగాణ

telangana

YS Sharmila: మా చిన్నాన్న వివేకా పేరుపై.. ఆస్తులు ఎప్పుడూ లేవు: షర్మిల

By

Published : Apr 26, 2023, 5:20 PM IST

Updated : Apr 26, 2023, 7:08 PM IST

YS Sharmila
YS Sharmila

17:15 April 26

ఆస్తులన్నీ సునీత పేరు మీదే మా చిన్నాన్న రాశారు: షర్మిల

ఆస్తులన్నీ సునీత పేరు మీదే మా చిన్నాన్న రాశారు: షర్మిల

YS Vivekananda Reddy murder case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యా ఉదంతంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. తన చిన్నాన్న వివేకా పేరు మీద ఎప్పుడూ ఆస్తులు లేవని తెలిపారు. ఆస్తులన్నీ సునీత పేరు మీదే తన చిన్నాన్న రాశారని షర్మిల పేర్కొన్నారు. ఆ ఆస్తులన్నీ ఎప్పటినుంచో సునీత పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. సునీత పేరు మీద ఆస్తులు అన్నీ ఉంటే.. వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదని చెప్పారు. ఆస్తి కోసమే అయితే రాజశేఖర్‌రెడ్డి హత్య చేయాల్సింది.. తన భార్య సునీతను అని వివరించారు.

చిన్నాన్న పేరిట ఉన్న అరకొర ఆస్తులు కూడా సునీత పిల్లలకే రాసి ఇచ్చారని వైఎస్‌ షర్మిల వెల్లడించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి ప్రజా నాయకుడు.. ప్రజల మనిషి అని అన్నారు. ఆస్తి కోసం అయితే మాత్రం ఈ హత్య జరగలేదన్నారు. ఆస్తులు అన్నీ సునీత పేరు మీద ఎప్పుడూ తన చిన్నాన్న వీలునామా రాశారని పేర్కొన్నారు. పులివెందుల, కడప జిల్లా ప్రజానికానికి వివేకానంద రెడ్డి గురించి బాగా తెలుసని.. లేని వ్యక్తి మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన సాధారణ జీవితం గడిపారన్నారు. కొన్ని మీడియాలు ఆయన గురించి, తన పర్సనల్‌ లైఫ్‌ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పర్సనల్‌ లైఫ్‌ మాట్లాడే అర్హత ఏ ఒక్కరికీ లేదని.. వారు చేస్తున్న కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు కావస్తున్న ఇంకా దానిపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. గత నెలలో ఈ నెల 30వ తేదీతో ఈ హత్య కేసును ముగించాలని సీబీఐకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్యా జూన్‌ 30 వరకు పొడిగిస్తూ గడువును పెంచింది. ఇంత ఆలస్యం అవ్వడానికి గల కారణాలు కూడా లేకపోలేదు. సీబీఐ ప్రధాన నిందితునిగా అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అవినాష్‌ రెడ్డికి ఎంతో సన్నిహితుడిగా ఉన్న ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఆ తర్వాత అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. అరెస్ట్‌ చేయకుండా ఉండడానికి పిటిషన్‌ వేశారు. అందుకు తగ్గట్లుగానే హైకోర్టు సైతం అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని సీబీఐకు తెలిపింది. కేసులో దర్యాప్తును పెంచడానికి సునీత నర్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తెలంగాణ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 26, 2023, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details