తెలంగాణ

telangana

'మహా సర్కారును కూల్చేందుకు భాజపా కుట్ర.. ఈడీతో ఒత్తిడి'

By

Published : Feb 15, 2022, 10:33 PM IST

Sanjay Raut press conference: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ సర్కారును కూల్చేందుకు కేంద్రంలోని భాజపా ఒత్తిడి తీసుకొస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని అన్నారు. 2024లో దేశంలో సమూల మార్పులు చేసుకుంటాయని చెప్పారు.

Sanjay Raut press conference
Sanjay Raut press conference

Sanjay Raut press conference: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అరోపించారు. ముంబయి దాదర్​లో ఉన్న సేన భవన్​లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఇలాంటి వ్యూహాలకు అఘాడీ లొంగిపోదని అన్నారు.

Sanjay Raut on BJP:

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తననూ లొంగదీసుకోవాలని చూశారని చెప్పుకొచ్చారు.

"20 రోజుల క్రితం కొందరు సీనియర్ భాజపా నేతలు నన్ను కలిశారు. వారికి విధేయంగా ఉండాలని సూచించారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని అనుకుంటున్నామని చెప్పారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే 'పరిస్థితిని చక్కబెడతాయ'ని వారు చెప్పారు. ఎన్​సీపీ చీఫ్ శరద్ పవార్ సంబంధీకుల ఇళ్లపై జరిగిన ఈడీ దాడులను ప్రస్తావించారు. నేను వారికి మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పా. అప్పటి నుంచి నాకు తెలిసిన వారిని టార్గెట్ చేస్తున్నారు."

-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ

తన కూతురి పెళ్లికి పని చేసిన వారందరినీ ఈడీ టార్గెట్ చేసిందని, డెకరేటర్లు, బ్యూటిషియన్లు, టైలర్లను సైతం విచారిస్తోందని ఆరోపించారు రౌత్. 'నన్ను టార్గెట్ చేసిన తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్​ ఇంట్లో సోదాలు జరిగాయి. ఆ రోజు రాత్రే నేను అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడా. ఇది మంచిది కాదని చెప్పా. కావాలంటే నన్ను టార్గెట్ చేయండి కానీ.. నా స్నేహితులు, కుటుంబ సభ్యులను వదిలేయమని కోరా' అని చెప్పారు.

2024లో దేశంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని రౌత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్న వారు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:నినాదాలే బ్రహ్మాస్త్రాలు- ఎన్నికల్లో గెలిపిస్తాయా?

ABOUT THE AUTHOR

...view details