తెలంగాణ

telangana

సర్పంచ్​గా గెలిచిన కొద్ది గంటలకే మృతి.. ప్రమాణస్వీకారానికి వెళ్తూ..

By

Published : Jul 6, 2022, 5:30 PM IST

సర్పంచ్​గా గెలిచాడు. విజయోత్సాహంతో అనుచరులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలుదేరాడు. గమ్యం చేరేలోపే అతడి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ ఏమైంది?

landslide in Rudraprayag
landslide in Rudraprayag

ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఒకరు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. రుద్రప్రయాగ్ జిల్లాలోనూ మరికొన్ని చోట్ల బద్రీనాథ్​ హైవేపై కొండ చరియలు విరిగిపడగా.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విజయోత్సాహం.. విషాదం:ప్రతాప్ సింగ్​(50) తెహ్రీ జిల్లా టాటోర్ గ్రామ సర్పంచ్​గా గెలిచాడు. బుధవారం తట్యుడ్​లో ప్రమాణ స్వీకారం చేసేందుకు మరో ముగ్గురితో కలిసి కారులో బయలుదేరాడు. జౌన్​పుర్​ మండలంలోని అల్గడ్-తట్యుడ్ రోడ్​పై వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద బండరాయి వారి కారుపై పడింది. ప్రతాప్​ సింగ్​ అక్కడికక్కడే మరణించగా మిగిలిన ముగ్గురు గాయపడ్డారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.

విపత్తుల కాలం:రాజధాని దేహ్రాదూన్​ సహా ఉత్తరాఖండ్​లోని అనేక ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉత్తరకాశీలో 44.5 మిల్లీమీటర్లు, బాగేశ్వర్​లో 32.3 మిల్లీమీటర్లు, దేహ్రాదూన్​లో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వానలతో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రుద్రప్రయాగ్​ జిల్లా సిరోగాబాద్​లో కొండచరియలు విరిగి బద్రీనాథ్​ హైవేపై పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై బండరాళ్లు తొలగించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి:ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. 'మహా'లో మరో 3 రోజులు కుండపోతే..!

ABOUT THE AUTHOR

...view details