తెలంగాణ

telangana

'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'

By

Published : Oct 20, 2021, 10:27 AM IST

Updated : Oct 20, 2021, 10:40 AM IST

Previous government did not have will to fight corruption,  says PM Narendra Modi
మోదీ, గుజరాత్​, సీవీసీ ()

గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే.. దేశంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు మోదీ(Modi news). ఇప్పుడు తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో.. అవినీతిపై పోరాటం చేస్తోందన్నారు. ప్రజలను, దేశాన్ని మోసం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు (PM Modi news).

అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Modi news) పునరుద్ఘాటించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా.. దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లు పేర్కొన్నారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్​ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్​ నుంచి వర్చువల్​గా హాజరైన మోదీ(Modi news) ఈ వ్యాఖ్యలు చేశారు.

''చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. జాతి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా.. తాము కనికరం చూపించబోమని దేశం నమ్ముతోంది. ప్రభుత్వం ఇలాంటివారిని అసలు విడిచిపెట్టదు.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

గత ప్రభుత్వాలకు రాజకీయ, పరిపాలనా సామర్థ్యం రెండూ లేవని, ఇప్పుడు.. అవినీతిని పారదోలే పటిష్ఠ వ్యవస్థ, రాజకీయ సంకల్పం తమకున్నాయని అన్నారు మోదీ(Modi news). మధ్యవర్తులు లేకుండానే.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలమని ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని చెప్పారు. ప్రజలు.. పారదర్శకమైన వ్యవస్థ, సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారని మోదీ(PM Modi news) తెలిపారు.

ఇవీ చూడండి: చైనా కుటిల నీతి.. తిప్పికొట్టేందుకు భారత్​ వ్యూహ రచన

Last Updated :Oct 20, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details