తెలంగాణ

telangana

ఆయన ధైర్యం వల్లే ఆస్కార్ కల నిజమైంది.. RRR టీమ్​కు ప్రముఖుల అభినందనలు

By

Published : Mar 13, 2023, 10:51 AM IST

Updated : Mar 13, 2023, 11:52 AM IST

RRR team

politicians congratulates RRR team : అస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆర్ఆర్ఆర్ టీమ్​కు అభినందనలు తెలియజేస్తున్నారు. నాటు నాటు పాటను ప్రపంచం ఏళ్ల తరబడి గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

politicians congratulates RRR team : ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌ గెలుచుకుంది. ఈ క్రమంలోనే సినీ, రాజకీయప్రముఖులు నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నాటు నాటుకు ఆస్కార్‌తో భారత్‌ గర్వపడుతోందని వివరించారు. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలని తెలియజేశారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుందని.. ఈ పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారుని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం అభినందనీయం: నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన ఆర్ఆర్​ఆర్​ చిత్ర యూనిట్‌కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన.. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని వివరించారు. తెలుగు వెండితెర ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. విశ్వ వేదికపై భారతీయ సినిమాకి దక్కిన మరో గొప్ప గౌరవమని కిషన్​రెడ్డి వెల్లడించారు.

నాటు నాటు' గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని వివరించారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని స్పష్టం చేశారు. 'నాటు నాటు' గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని తెలిపారు. ఈ గీతం తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని అన్నారు. తెలుగులోని మట్టి వాసనలను చంద్రబోస్‌ వెలుగులోకి తెచ్చారని చెప్పారు. కీరవాణి, చంద్రబోస్‌ సహా రాజమౌళి బృందానికి అభినందనలని వెల్లడించారు. హాలీవుడ్‌కు తీసిపోని విధంగా తెలుగు చిత్రాలు రూపొందడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా కీర్తి దిగంతాలకు వ్యాపించిందన్నారు. నాటునాటుకు ఆస్కార్‌ తెలుగు నేలకే కాదు దేశానికి గర్వకారణమని కేసీఆర్ కితాబిచ్చారు.

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు: ఆస్కార్ సాధించిన కీరవాణి, రాజమౌళి బృందానికి ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. నాటునాటు పాట సంగీత అభిమానులను అలరించిందని వివరించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చారని ఆయన వెల్లడించారు.

ఆస్కార్‌తో భారతీయులు, తెలుగు సినిమా గర్వించేలా చేశారు: ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్‌తో భారతీయులు, తెలుగు సినిమా గర్వించేలా చేశారని ఆమె పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కి ఆస్కార్ రావడం పట్ల రాష్ట్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చరిత్ర సృష్టించిన కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలని వివరించారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నృత్య కౌశలం అందరిని కదిలించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది: ఆస్కార్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ స్పష్టం చేశారు. 'నాటు నాటు' పాట ఎంపిక కావడం సంతోషదాయకమని తలసాని పేర్కొన్నారు. ఆర్ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌కు మంత్రి శ్రీనివాస్​గౌడ్ అభినందనలు తెలిపారు. 'నాటు నాటు' పాట తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని వివరించారు. ఆస్కార్ సాధించి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చారని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం: ఆర్ఆర్​ఆర్ సినిమా బృందానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి.. ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలని పేర్కొన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకమని ఆయన వివరించారు.

భారతీయ, తెలుగుచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారు:భారతీయ, తెలుగుచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాజమౌళి, చిత్ర బృందానికి అభినందనలని వివరించారు. నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికే గర్వకారణమని లోకేశ్‌ వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి.. ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలని పేర్కొన్నారు. భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:ప్రశాంతంగా కొనసాగుతోన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు

సాహోరే కీరవాణీ.. ఇంగ్లీష్ పాట పాడుతూ ఎమోషనల్​..

Last Updated :Mar 13, 2023, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details