తెలంగాణ

telangana

Mann ki baat PM Modi: ''మన్​ కీ బాత్​' కోసం సలహాలు ఇవ్వండి'

By

Published : Sep 16, 2021, 10:51 AM IST

Updated : Sep 16, 2021, 12:04 PM IST

ఈనెల 26న జరగనున్న 'మన్​ కీ బాత్'​ (mann ki baat PM Modi) కార్యక్రమంలో మాట్లాడాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు 'మైగవ్​' లింక్​ను ట్వీట్​ చేశారు మోదీ (PM mann ki baat).

PM Modi
ప్రధాని మోదీ

ప్రతినెల జరుగుతున్న 'మన్​ కీ బాత్' (mann ki baat PM Modi) కార్యక్రమానికి ప్రజల నుంచి ఆసక్తికర సలహాలు, సూచనలు వస్తున్నాయి. అలాగే ఈ నెల 26న జరగనున్న 'మన్​ కీ బాత్' (mann ki baat PM Modi)​ కార్యక్రమంలో మాట్లాడాల్సిన అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM mann ki baat) కోరారు. ఇందుకు 'మైగవ్'​ పోర్టల్ లింక్​ను ట్విట్టర్​లో షేర్ చేశారు మోదీ(PM Modi).​

"​మన్​ కీ బాత్​ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. అలాగే ఈ నెలలో జరగనున్న మన్​కీబాత్​ కార్యక్రమంలో మాట్లాడాల్సిన అంశాలపై సలహాలు, సూచనలను ప్రజలు ఇవ్వాలి. నమో యాప్​, మైగవ్​ లేదా రికార్డు చేసి 1800-11-7800 నంబరుకు సందేశం ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు​."

- ప్రధాని నరేంద్ర మోదీ

అంతకుముందు ఆగస్టు 29న జరిగిన 80వ 'మన్ కీ బాత్' (mann ki baat Modi) ప్రసంగంలో.. గ్రామ వ్యర్థాల నిర్వహణ, స్వావలంబన కోసం చొరవ చూపిన బిహార్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం, తమిళనాడులోని కంజీరంగల్ పంచాయితీని ప్రధాని ప్రశంసించారు.

ఇదీ చూడండి:విధిరాతను ఎదిరించి.. పెయింటింగ్​లో అద్భుతాలు

Last Updated :Sep 16, 2021, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details