తెలంగాణ

telangana

మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 9:54 AM IST

PM Modi tweet on Telangana Assembly Elections : రాష్ట్రంలో పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖులంతా పిలుపునిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు.. ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇతర ప్రముఖ నాయకులు తమ ఎక్స్​(ట్విటర్) ఖాతాలో ఓటు వినియోగించాలని ట్వీట్​ చేస్తున్నారు.

KTR Tweet on Telangana polling 2023
Political Leaders Tweet on Telangana Assembly Elections

PM Modi tweet on Telangana Assembly Elections : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం మొదలయింది. ప్రతి ఓటరు ఓటు వేసేందుకు ముందుకు రావాలని.. ఆలోచించి నాయకుణ్ని ఎన్నుకోవాలని ప్రముఖులు సూచిస్తున్నారు. గతం కంటే ఎక్కువ ఓటింగ్​ శాతం వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ.. పోలింగ్​ కేంద్రానికి వెళ్లి వేలికి సిరా మార్కు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తదితర నాయకులు ఓటు వేయాలని వారి ఎక్స్(ట్వీటర్)లో ప్రజలకు సందేశాన్నిచ్చారు.

PM Modi Tweet on Telangana polling 2023: 'తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నానని' నరేంద్ర మోదీ ట్వీట్ (Narendra Modi Tweet)చేశారు.

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​

Rahul Gandhi Tweet on Telangana polling 2023: 'నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్​ను గెలిపించండి!' - రాహుల్​ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత

Priyanka Gandhi Tweet on Telangana polling 2023: 'నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు జై తెలంగాణ జై హింద్' అని ప్రియాంక గాంధీ ట్వీట్(Priyanka Gandhi Tweet) చేశారు.

KTR Tweet on Telangana polling 2023 : 'మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి, మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి, మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి. మీ ఓటు.. వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి. మీ ఓటు.. మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి. మీ ఓటు.. యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి. మీ ఓటు.. సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలి.

మీ ఓటు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి. మీ ఓటు.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వకండి అందుకే.. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. అందరూ రండి..! ప్రతి ఒక్కరూ "ముచ్చటగా..." ఓటు హక్కును వినియోగించుకొండి..!! జై తెలంగాణ జై భారత్' -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

వికలాంగుల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు : శైలజ

Kishan Reddy Tweet on Telangana polling 2023 : 'మీ ఓటు ఇప్పుడు వచ్చే ఐదేళ్ల గతిని నిర్ణయిస్తుంది. కొత్త, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటు కీలకం. అర్హులైన ఓటర్లందరూ, ప్రత్యేకించి మొదటిసారిగా ఓటు వేసినవారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కుటుంబం, స్నేహితులు కూడా ఓటు వేయడానికి బయటకు వచ్చేలా చూసుకోండి.' అని కిషన్​రెడ్డి ట్వీట్​ చేశారు.

అడుగడుగునా పోలీసుల నిఘా - లక్షమంది బలగంతో పటిష్ఠ బందోబస్తు

ఓటు వేయకుంటే బతికి ఉన్నా లేనట్లే, వచ్చేస్తున్నాం, ఓటేస్తామంటున్న ప్రజానికం

ABOUT THE AUTHOR

...view details