తెలంగాణ

telangana

అంతర్గత భద్రతా పరిస్థితులపై ప్రధాని సమీక్ష

By

Published : Dec 3, 2020, 5:09 AM IST

Updated : Dec 3, 2020, 5:50 AM IST

ప్రజానుకూల విధానాలతో దేశ భధ్రతను పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బుధవారం జరిగిన 55 వ డీజీపీల సదస్సులో హోంమంత్రి అమిత్ షాతో కలిసి వర్చువల్​గా ఆయన పాల్గొన్నారు.

PM briefed on internal security situation at DGPs meet
అంతర్గత భద్రతా పరిస్థితులపై ప్రధాని సమీక్ష

ప్రజానుకూల విధానాల ద్వారా భద్రతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. బుధవారం జరిగిన 55వ డీజీపీల వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. దేశ అంతర్గత భద్రతా పరిస్థితులను అధికారులు ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వర్చువల్​గా హాజరయ్యి ప్రారంభించారు.

ఉక్కుపాదం మోపాలి..

జాతీయ భద్రతా విషయంలో అన్ని భద్రతా సంస్థలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు అమిత్​షా సూచించారు. ఉగ్రవాదంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని.. ప్రజల భద్రత, మర్యాదలకు భరోసా ఇవ్వాలని డీజీపీలకు నిర్దేశించారు.

ఎస్​పీఓను రూపొందించుకోవాలి..

వామపక్ష తీవ్రవాదంపై సదస్సులో చర్చ జరిగింది. ఈ సమస్యను నియంత్రించడానికి రాష్ట్రాలు మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు(స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్స్​) రూపొందించాలని నిర్ణయించారు. ఏటా కేంద్ర విభాగం ఆధ్వర్యాన నిర్వహించే ఈ సమావేశాన్ని కొవిడ్​-19 నేపథ్యంలో తొలిసారి వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేపట్టారు.

అత్యంత మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు అధికారులకు హోంమంత్రి వర్చువల్​ విధానంలో పోలీసు పతకాలను అందజేశారు. తాజా గణాంకాల ప్రకారం దేశ పారామిలటరీ దళాల్లో ఇప్పటివరకూ సమారు 80 వేల మంది కొవిడ్​కు గురికాగా, వారిలో 650 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవి'పై ఆరా

Last Updated : Dec 3, 2020, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details