తెలంగాణ

telangana

అయోధ్య రామమందిరం కూల్చివేతకు పీఎఫ్ఐ కుట్ర.. 'బాబ్రీ' పునర్నిర్మాణం కోసం..!

By

Published : Oct 18, 2022, 12:21 PM IST

Updated : Oct 18, 2022, 12:53 PM IST

PFI plan to demolish Ram templ
PFI plan to demolish Ram templ

12:15 October 18

అయోధ్య రామమందిరం కూల్చివేతకు పీఎఫ్ఐ కుట్ర.. 'బాబ్రీ' పునర్నిర్మాణం కోసం..!

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలను మహారాష్ట్ర ఏటీఎస్ బయటపెట్టింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేల్చింది. రామ మందిరాన్ని కూల్చి ఆ స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించాలని పథకరచన చేసినట్లు వెల్లడైంది. నిషేధిత పీఎఫ్ఐకి చెందిన పలువురిని అరెస్టు చేసి ప్రశ్నించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్).. సమాజంలో అశాంతి చెలరేగేలా కుట్రలు పన్నినట్లు గుర్తించింది. రామ మందిరాన్ని కూల్చివేయడం, ఆ స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించడం, 2047 నాటికి భారత్​ను ముస్లిం దేశంగా మార్చడం అందులో భాగమని నాశిక్ కోర్టుకు ఏటీఎస్ తెలిపింది.

మతకల్లోహాలు సృష్టించడం సహా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో మహారాష్ట్ర ఏటీఎస్.. పీఎఫ్ఐకి చెందిన సభ్యులను అరెస్ట్ చేసింది. పీఎఫ్ఐ మాలేగావ్ జిల్లా అధ్యక్షుడు మౌలానా సయీద్ అహ్మద్ అన్సారీ సహా ఐదుగురిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో పుణె పీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం షేక్, పీఎఫ్ఐ డివిజనల్ సెక్రెటరీ మౌలా నబీసాబ్ ముల్లా(కొల్హాపుర్), రజియా అహ్మద్ ఖాన్, వసీమ్ షేక్​లు ఉన్నారు.

Last Updated :Oct 18, 2022, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details