తెలంగాణ

telangana

'మాక్​డ్రిల్​' ఆస్పత్రి సీజ్.. రోగుల తరలింపు

By

Published : Jun 9, 2021, 10:55 AM IST

మాక్​డ్రిల్ పేరిట కరోనా రోగుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్​ప్రదేశ్​​ ఆగ్రాలోని పరాస్ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. అంతకుముందు రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. ఇక ఉన్నఫలంగా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురైనట్లు రోగుల బంధువులు తెలిపారు.

Agra hospital sealed over 'mock oxygen drill' video
ఆ ఆస్పత్రి సీజ్.. రోగుల తరలింపులో బంధువుల పాట్లు

'ఆక్సిజన్​ డ్రిల్'​ పేరుతో 22మంది కొవిడ్​ రోగుల మరణాలకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని పరాస్ ఆస్పత్రిని జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. పాలనాధికారి ఆదేశాల మేరకు ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు బంధువులు. అయితే రోగుల తరలింపులో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని బంధువులు తెలిపారు.

ఆస్పత్రి సీజ్ చేసినట్లుగా అతికించిన కాగితం
సీజ్ అయిన పరాస్ ఆసుపత్రి
రోగుల బంధువుల తరలింపునకు ఏర్పాట్లు

"మా బంధువును 15 రోజుల క్రితం ఇక్కడ చేర్పించాం. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు. రోగిని తరలించేందుకు డిశ్చార్జ్ పత్రంపై సంతకం చేయమన్నారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలియదు. నగరంలోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి."

-లాల్ కుమార్ చౌహాన్, ఓ రోగి బంధువు

మరోవైపు తమ ఆస్పత్రిలో 22 మంది మరణించారన్న వార్తలను పరాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ ఖండించారు. దర్యాప్తునకు తాను సిద్ధమేనని.. పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పొరపాటునే 'మాక్ డ్రిల్' అనే పదాన్ని ఉపయోగించినట్లు వివరణ ఇచ్చారు.

పరాస్ ఆస్పత్రిని ఖాళీ చేస్తున్న రోగుల బంధువులు
ఆస్పత్రి ప్రాంగణంలో పోలీసులు

ఇవీ చదవండి:ఆసుపత్రి 'ఆక్సిజన్​ డ్రిల్​'- 22 మంది మృతి?

ABOUT THE AUTHOR

...view details