తెలంగాణ

telangana

Omicron India News: ఆ ఎనిమిది మందికి కరోనా.. ఒమిక్రాన్​ భయంతో...

By

Published : Dec 2, 2021, 2:51 PM IST

Omicron India news: ఒమిక్రాన్​ కట్టడి చర్యల్లో భాగంగా.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత దేశంలోకి వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్​ అని తేలింది. తదుపరి పరీక్షల కోసం వారి నమూనాలను ల్యాబ్​కు పంపించారు అధికారులు.

omicron india news
Omicron india news: ఆ ఎనిమిది మందికి కరోనా.. ఒమిక్రాన్​ సోకిందా?

Omicron scare in India ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ బారిన పడుతున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్​లో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ కొత్త వేరియంట్​కు సంబంధించిన వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో దేశానికి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు బయటపడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

వైరస్​ తీవ్రత అత్యంత ప్రమాదకరంగా ఉన్న దేశాల నుంచి 11 విమానాలు బుధవారం భారత్​కు వచ్చాయి. మొత్తం మీద 3,476 మంది ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఎనిమిది మందికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. అయితే వారికి ఒమిక్రాన్​ సోకిందా లేదా అని తెలుసుకునేందుకు నమూనాలను ల్యాబ్​కు పంపించారు.

ఇదీ చూడండి:-అక్టోబర్​లోనే 'ఒమిక్రాన్​' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు

దిల్లీలో నలుగురికి...

omicron india latest news: దిల్లీ విమానాశ్రయంలో దిగిన నలుగురికి కరోనా సోకింది. బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత వీరు దిల్లీకి చేరుకోగా.. పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. జీనోమ్​ సీక్వెన్సింగ్​ కోసం వారి నమూనాలను ల్యాబ్​కు పంపించారు.

ముంబయిలో..

దక్షిణాఫ్రికా నుంచి ముంబయి వచ్చిన నలుగురు ప్రయాణికులకు కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. ఒమిక్రాన్​ భయాల మధ్య ఆయా నమూనాలన ల్యాబ్​కు పంపించినట్టు ముంబయి మేయర్​ కిశోరి పడ్నేకర్​ వెల్లడించారు.

అమల్లోకి వచ్చిన నిబంధనలు..

కరోనా కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై సమర్థ నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలు మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ను 'ముప్పు' దేశాలుగా పేర్కొంటూ కేంద్రం ఇప్పటికే జాబితా విడుదల చేసిన సంగతి గమనార్హం.

ఒమిక్రాన్​ వేరియంట్​ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ రకం వైరస్​.. వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరించారు. ఒమిక్రాన్​ను తీవ్రంగా పరిగణించాలని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:-

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

Omicron variant: 'ఒమిక్రాన్'​తో భయాలొద్దు.. ఈ గుడ్​న్యూస్​ చూడండి!

US Travel Requirements: అమెరికా వెళ్లాలా? కొత్త రూల్స్​ తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details